విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి …..నాగ శేషు రాష్ట్ర సహాయ కార్యదర్శి
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, అదనపు యాప్లు రద్దు చేయాలి, ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో ప్రభుత్వ ఉద్యోగులు అన్న పదాన్ని రద్దు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగ శేషు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈరోజు అనగా 23 అక్టోబర్ న జగదాంబ సిఐటియు ఆఫీసులో జరిగిన అంగన్వాడి యూనియన్ విశాఖ జిల్లా రెండవ మహాసభకు ముఖ్య అతిథిగా నాగ శేషు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు గడిచిన ఏడు సంవత్సరాలుగా వేతనాలు పంచకుండా ప్రభుత్వం తీవ్ర ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అంగన్వాడీ పథకాన్ని ప్రజల్లో గొప్పగా చెబుతూ, దాంట్లో పనిచేస్తున్న అంగన్వాడీలకు మాత్రం తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వేతనాల పెంపుదల కోసం పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీల పోరాటం దేశానికి ఆదర్శం అన్నారు. 2023 లో జరిగిన 42 రోజుల చారిత్రాత్మక సమ్మె ఫలితంగా సాధించిన ఎనిమిది జీవో లతోపాటు వేతనాల పెంపకం మరో చారిత్రక పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే విశాఖ జిల్లాలో జరగబోతున్న 18వ సిఐటియు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
మహాసభ 32 మందితో జిల్లా కమిటీ, 19 మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నది. అధ్యక్షురాలుగా ఎల్ . దేవి , ప్రధాన కార్యదర్శిగా కే వెంకటలక్ష్మి, కోశాధికారిగా ఆర్ శోభారాణి, గౌరవ అధ్యక్షులుగా పి. మణి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కే.పద్మావతి, అడిషనల్ జనరల్ సెక్రెటరీగా కే బృందావతి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆర్. ఈశ్వరమ్మగార్లను ఎన్నుకోవడం జరిగింది.


