శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రంగినేని చెంచయ్య నాయుడు, తన ఎన్నిక అనంతరం మీడియా సమావేశంలో కృతజ్ఞతా భావంతో స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, కూటమి ప్రభుత్వం, అలాగే స్థానిక కార్యకర్తలు–నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం వ్యక్తిగతం కాదు కార్యకర్తల అంకితభావం, కష్టం, నిబద్ధత కలగలిపిన ఫలితం అని చెంచయ్య నాయుడన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకిత భావంతో ఉంటూ పట్టుదలతో పనిచేస్తానని గతంలో బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి హయంలో కూడా ఇదే బాధ్యతలు నిర్వహించానని అప్పటిలాగే ఇప్పుడు కూడా అదే క్రమశిక్షణ, అదే పట్టుదలతో పనిచేస్తానన్నారు.
తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను నేను అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండలాల అధ్యక్షులు రాష్ట్ర మరియు పార్లమెంట్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.

అంకిత భావంతో ఉంటూ పట్టుదలతో పనిచేస్తా… రంగినెని చెంచయ్య నాయుడు
శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రంగినేని చెంచయ్య నాయుడు, తన ఎన్నిక అనంతరం మీడియా సమావేశంలో కృతజ్ఞతా భావంతో స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, కూటమి ప్రభుత్వం, అలాగే స్థానిక కార్యకర్తలు–నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం వ్యక్తిగతం కాదు కార్యకర్తల అంకితభావం, కష్టం, నిబద్ధత కలగలిపిన ఫలితం అని చెంచయ్య నాయుడన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకిత భావంతో ఉంటూ పట్టుదలతో పనిచేస్తానని గతంలో బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి హయంలో కూడా ఇదే బాధ్యతలు నిర్వహించానని అప్పటిలాగే ఇప్పుడు కూడా అదే క్రమశిక్షణ, అదే పట్టుదలతో పనిచేస్తానన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను నేను అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండలాల అధ్యక్షులు రాష్ట్ర మరియు పార్లమెంట్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.

