🏟️ ప్రపంచంలోనే తొలి స్కై స్టేడియం సౌదీలో!
సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది. ‘ది లైన్’ నగరంలోని నియోమ్ స్టేడియంగా ఈ అద్భుత ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. భూమికి సుమారు 350 మీటర్ల ఎత్తులో నిర్మించబడుతున్న ఈ స్టేడియం ఆధునిక సాంకేతికతతో ప్రపంచ క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. 2032 నాటికి స్టేడియం ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.


