ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లు, సొసైటీ ఫర్ వైబ్రేంట్ కమిటీ సభ్యులతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది… అనంతరం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం జరిగింది… ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు, సొసైటీ అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ణ గార్లతో కలిసి ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించడం జరిగింది…
పుష్కరకాలం తర్వాత విజయవాడ నగరంలో ఎగ్జిబిషన్ మళ్లీ పున ప్రారంభం కావడం అది కూడా శ్రీ నందమూరి బాలకృష్ణ గారి చేతులమీదుగా ప్రారంభించడం ఎంతగానో ఆనందంగా ఉంది… నందమూరి బాలకృష్ణ గారు క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నారు… అమరావతిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ హాస్పిటల్ వలన పేదలకు మంచి వైద్య సేవలు అందుతాయి…
ఈరోజు విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సింగర్ సునీత గారి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ప్రజలను ఎంతగానో అలరించాయి…
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించినందుకు ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు….


