Thursday, 26 March 2026
  • Home  
  • స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి డీఈవో కార్యాలయంలో ఇద్దరికి మెమోలు
- ఖమ్మం

స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి డీఈవో కార్యాలయంలో ఇద్దరికి మెమోలు

ఖమ్మం, జనవరి (పున్నమి దినపత్రిక జిల్లా స్టాఫర్) విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన స్కూల్ అసిస్టెంట్‌పై జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని కఠిన చర్యలు తీసుకున్నారు. ఖమ్మం నగరంలోని మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బానోత్ గౌతమిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ, నగరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు సంబంధించిన అడ్మిషన్ ప్రమోషన్లు చేయడం, పాఠశాల సమయాల్లో రీల్స్ చేస్తూ సమయం వృథా చేయడం వంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఈ విషయమై గతంలో పలుమార్లు ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ ఆమె తన తీరు మార్చుకోకపోవడంతో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు డీఈవో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మాత్రమే కృషి చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు. ఇదే సమయంలో డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు కార్యాలయ సమయాన్ని పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ డీఈవో టేబుల్‌పై ఉన్నాయని అబద్ధాలు చెప్పినట్లు గుర్తించడంతో మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. కార్యాలయ సిబ్బంది సమయపాలనతో పాటు అంకితభావంతో విధులు నిర్వహించాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డీఈవో హెచ్చరించారు

ఖమ్మం, జనవరి
(పున్నమి దినపత్రిక జిల్లా స్టాఫర్)

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన స్కూల్ అసిస్టెంట్‌పై జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని కఠిన చర్యలు తీసుకున్నారు. ఖమ్మం నగరంలోని మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బానోత్ గౌతమిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ, నగరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు సంబంధించిన అడ్మిషన్ ప్రమోషన్లు చేయడం, పాఠశాల సమయాల్లో రీల్స్ చేస్తూ సమయం వృథా చేయడం వంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఈ విషయమై గతంలో పలుమార్లు ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ ఆమె తన తీరు మార్చుకోకపోవడంతో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు డీఈవో తెలిపారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మాత్రమే కృషి చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు.

ఇదే సమయంలో డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు కార్యాలయ సమయాన్ని పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ డీఈవో టేబుల్‌పై ఉన్నాయని అబద్ధాలు చెప్పినట్లు గుర్తించడంతో మెమోలు ఇచ్చినట్లు తెలిపారు.

కార్యాలయ సిబ్బంది సమయపాలనతో పాటు అంకితభావంతో విధులు నిర్వహించాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డీఈవో హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.