*సోలిపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఇన్స్పెక్షన్ టీం*
*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 09/ 02/2026*
*జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సోలిపూర్ ఈరోజు పాఠశాలను జిల్లా ఇన్స్పెక్షన్ టీం సందర్శించడం జరిగింది అందులో ఆరవ తరగతి హిందీ పండితులు కే. వెంకటేష్ గారి బోధన అభ్యసన ప్రక్రియలను సందర్శించడం రికార్డులను తనిఖీ చేయడం పిల్లల్లో ద్విత్వాక్షర, సంయుక్తాక్షరముల పరిచయం, పిల్లలు హిందీ భాషలో ఆత్మ పరిచయం మొదలగు అభ్యసన ప్రక్రియ ద్వారా యాక్టివిటీస్ బోధన పద్ధతి ద్వారా హిందీ సులభంగా నేర్చుకోవచ్చని హిందీ రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయ కుమార్ తెలియజేశారు. అలాగే రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి కష్టపడి హిందీ భాష నైపుణ్యాలను పెంపొందించుకొని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.*


