Friday, 20 March 2026
  • Home  
  • సిరిబొమ్మ ఆచారంతో మోదుగులమ్మ ఉత్సవం ఘనంగా
- తూర్పు గోదావరి

సిరిబొమ్మ ఆచారంతో మోదుగులమ్మ ఉత్సవం ఘనంగా

తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా): తాళ్లపూడి మండలంలోని తాళ్లపూడి గ్రామంలో శ్రీశ్రీశ్రీ మోదుగులమ్మ అమ్మవారి ఉత్సవాలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నా మన పరమేశ్వరరావు ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సిరి బొమ్మ రూపంలో గ్రామమంతా ఊరేగింపుగా ఇంటింటికి తీసుకెళ్లి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు నీళ్ల బిందెలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో అమ్మవారిని పూజించి తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు. తరువాత అమ్మవారిని దేవాలయానికి తీసుకువచ్చి, భక్తుల దర్శనార్థం గుడి ముందు ప్రాంగణంలో ఉంచి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సిరిబొమ్మ రూపంలో మూడు సార్లు తిప్పే ఆచారం నిర్వహించారు. అప్పుడు భక్తులు జీడిమామిడికాయలు లేదా అరటిపండ్లతో సిరిబొమ్మను తాకుతూ తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు. ఈ పద్ధతి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించి భక్తి పరవశులయ్యారు. భక్తులు, కమిటీ సభ్యులు మరియు పోలీసుల పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉగాది పండుగ రోజు గ్రామ ప్రజలంతా అమ్మవారి ఆశీర్వాదాలతో ఆనందంగా దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా బుట్ట బొమ్మలు, కాళికామాత బొమ్మలతో తీన్మార్ ఊరేగింపు నిర్వహించడం ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవంలో మోదుగులమ్మ అమ్మవారి కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. Uploaded Video:

తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా):
తాళ్లపూడి మండలంలోని తాళ్లపూడి గ్రామంలో శ్రీశ్రీశ్రీ మోదుగులమ్మ అమ్మవారి ఉత్సవాలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నా మన పరమేశ్వరరావు ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా జరిగింది.
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సిరి బొమ్మ రూపంలో గ్రామమంతా ఊరేగింపుగా ఇంటింటికి తీసుకెళ్లి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు నీళ్ల బిందెలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో అమ్మవారిని పూజించి తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు.
తరువాత అమ్మవారిని దేవాలయానికి తీసుకువచ్చి, భక్తుల దర్శనార్థం గుడి ముందు ప్రాంగణంలో ఉంచి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సిరిబొమ్మ రూపంలో మూడు సార్లు తిప్పే ఆచారం నిర్వహించారు. అప్పుడు భక్తులు జీడిమామిడికాయలు లేదా అరటిపండ్లతో సిరిబొమ్మను తాకుతూ తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు. ఈ పద్ధతి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించి భక్తి పరవశులయ్యారు.
భక్తులు, కమిటీ సభ్యులు మరియు పోలీసుల పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉగాది పండుగ రోజు గ్రామ ప్రజలంతా అమ్మవారి ఆశీర్వాదాలతో ఆనందంగా దర్శనం చేసుకున్నారు.
ఈ సంవత్సరం ప్రత్యేకంగా బుట్ట బొమ్మలు, కాళికామాత బొమ్మలతో తీన్మార్ ఊరేగింపు నిర్వహించడం ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఉత్సవంలో మోదుగులమ్మ అమ్మవారి కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.