, నవంబర్ (పున్నమి ప్రతినిధి)
ఇటీవలి న్యూఢిల్లీలో జరిగిన 66వ సార్క్ దేశాల సాహిత్య సదస్సులో ఆహ్వానిత కవిగా పాల్గొని, సార్క్ సాహిత్య పురస్కారం–2025 అందుకున్న తొలి తెలుగు రచయితగా చరిత్ర సృష్టించిన డా. పెరుగు రామకృష్ణకు శుక్రవారం ఉదయం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, “డా. పెరుగు సాధించిన ఈ ప్రతిష్టాత్మక గౌరవం తెలుగు జాతి గర్వించదగ్గ విజయమని” అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో గుర్తింపు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు భాష–సాహిత్య పురోభివృద్ధికి విశ్వవిద్యాలయం–తెలుగు శాఖతో కలసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
సంబోధనలో డా. పెరుగు రామకృష్ణ మాట్లాడుతూ, “ఈ అవార్డు తిక్కన నేలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. కవిగా 50 ఏళ్ల సాహితీ స్వర్ణోత్సవం జరుగుతున్న సందర్భంలో ఈ పురస్కారం రావడం ప్రత్యేక ఆనందం కలిగించింది” అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖాధినేత ఆచార్య త్యాగరాజు, అధ్యాపకులు రాజారాం, విమల పాల్గొన్నారు.


