Saturday, 14 March 2026
  • Home  
  • సమాజ సేవలో పీపుల్స్ హాస్పిటల్
- రాజన్న సిరిసిల్ల

సమాజ సేవలో పీపుల్స్ హాస్పిటల్

ముస్తాబాద్‌లో 60 మంది టీబీ బాధితులకు ఆహార సహాయం – పీపుల్స్ హాస్పిటల్ దత్తతతో టీబీ ముక్త్ భారత్ వైపు అడుగు” రాజన్న సిరిసిల్ల , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముస్తాబాద్ మండల వైద్యాధికారిణి డాక్టర్ అఫీజ ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ యూనిట్ గంభీరావుపేట క్లస్టర్ పరిధిలోని 60 మంది టీబీ బాధితులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేశారు. సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిణి డా. రజిత పిలుపు మేరకు పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ డా. శంకర్ 60 మంది క్షయ వ్యాధిగ్రస్తులను ఆరు నెలల పాటు దత్తత తీసుకుని, నెలకు రూ.600 విలువైన బియ్యం, పప్పు, నూనె, పల్లి, గుడ్లు, ప్రోటీన్ పౌడర్ అందించనున్నట్లు డా. అఫీజ తెలిపారు. కార్యక్రమంలో డా. రజిత, టీబి పీఓ డా. అనిత, డా. సంపత్, డా. రామకృష్ణ, టీబి సూపర్వైజర్ మహిపాల్, నోడల్ ప్రసాద్ పాల్గొన్నారు.

ముస్తాబాద్‌లో 60 మంది టీబీ బాధితులకు ఆహార సహాయం – పీపుల్స్ హాస్పిటల్ దత్తతతో టీబీ ముక్త్ భారత్ వైపు అడుగు”

రాజన్న సిరిసిల్ల , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముస్తాబాద్ మండల వైద్యాధికారిణి డాక్టర్ అఫీజ ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ యూనిట్ గంభీరావుపేట క్లస్టర్ పరిధిలోని 60 మంది టీబీ బాధితులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేశారు. సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిణి డా. రజిత పిలుపు మేరకు పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ డా. శంకర్ 60 మంది క్షయ వ్యాధిగ్రస్తులను ఆరు నెలల పాటు దత్తత తీసుకుని, నెలకు రూ.600 విలువైన బియ్యం, పప్పు, నూనె, పల్లి, గుడ్లు, ప్రోటీన్ పౌడర్ అందించనున్నట్లు డా. అఫీజ తెలిపారు. కార్యక్రమంలో డా. రజిత, టీబి పీఓ డా. అనిత, డా. సంపత్, డా. రామకృష్ణ, టీబి సూపర్వైజర్ మహిపాల్, నోడల్ ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.