Thursday, 5 February 2026
  • Home  
  • సమాజ ప్రగతికి పత్రికలు దోహదపడాలి స్వాతంత్ర్య పోరాటంలో పత్రికలు కీలక భూమిక పోషించాయి
- విశాఖపట్నం

సమాజ ప్రగతికి పత్రికలు దోహదపడాలి స్వాతంత్ర్య పోరాటంలో పత్రికలు కీలక భూమిక పోషించాయి

ఆంధ్రవిశ్వవిద్యాలయం, అక్టోబర్ 23: సమాజ ప్రగతికి పత్రికలు దోహదపడాలని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు అన్నారు. ఏయూ ఆర్ట్స్, కామర్స్ కళాశాల ఆధ్వర్యంలో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఏయూ శ తాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న సదస్సులలో భాగంగా గురువారం ఎవల్యూషన్ ఆఫ్ జ ర్నలిజం 1950 టు 2020- ద ఎరా ఆఫ్ డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ టు మోడరన్ ఇండియా ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట సమయంలో పత్రికలు కీలక భూమిక పోషించాయన్నారు* . ప్రజలను నిరంతరం చైతన్య వంతం చేయడం, స్వాతంత్య్ర స్ఫూర్తిని పెంచడంలో ఇవి ఎంతో కీలకంగా నిలచాయన్నారు. ప్రతికా రంగానికి విశేష సేవలు అందించిన హరేకృష్ణ మహతాబ్ కృషిని వివరించారు. ఒడిసా పూర్వ ముఖ్య మంత్రిగా, ఒడిసా పూర్వపు సంస్థానాలను రాష్ట్రంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఒరియాలో ఆయన ప్రారంభించి నిర్వహించిన పత్రికలు సమాజంలో ఎంతో మార్పును తీసుకురావడానికి దోహదపడ్డాయన్నారు. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఇంచార్జి ఉపకులపతి ఆచార్య డి.వి.ఆర్ మూర్తి మాట్లాడుతూ భారత దేశంలో జర్నిలిజం రంగంలో వచ్చిన మార్పులను వివరించారు.* సమాచారం అందించడం ప్రధాన అంశంగా జర్నలిజం ఆరంభం అయిందని నేడు దీని స్థానంలో ఎంటర్టైన్మెంట్ చేరిందన్నారు. ప త్రికా రంగం, టెలివిజన్ రంగం, నేటి డిజిటల్ రంగాలలో జరిగిన ప్రగతి, మార్పులను వివరించారు. ప త్రికల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వచ్చిన పలు చట్టాలు, ఎమర్జెన్సీ సమయంలో పత్రికల ప రిస్థితులను తెలిపారు. వాస్తవాలు, నిజంకి మధ్య వ్యత్యాసం ఉంటుందన్నారు. గాంధీజీ నడిపిన పత్రికల్లో అనేక సందర్భాలలో స్వాతంత్య్రం సాధించాలంటే సహనం అవసరమని చెప్పిన సందర్భాలను విద్యార్ధులకు వివరించారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ప్రెస్ కమీషన్ల ఏర్పాటు, దేశ అభివృద్ధికి దోహద పడిన ప్రతికలు, నెహృ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా పనిచేసిన సమయంలో పత్రికలపై వచ్చిన ఆంక్షలు, వాటిపై జరిగిన పోరాటాలు, ప్రెస్ కమీషన్లు ఏర్పాటు తదితర అంశాలు తెలియ జేశారు. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్, ఇంధిరాగాంధీ మరణం, బోపాల్ గ్యాస్ దుర్ఘటనలు దేశంలో ఎంతో ప్రముఖంగా నిలచాయన్నారు. వార్తల్లో వాస్తవాలు తగ్గిపోతున్నాయన్నారు. నేడు వార్తల్లో ఏఐ ప్రభావం పెరిగిపోతోందని, ఖచ్చితమైన సమాచారం పొందడం ప్రధానమన్నారు. ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.నరసింహా రావు సభకు అధ్యక్షత వహించారు* . విద్యార్థులకు ఉపయుక్తంగా విభాగంలో తరచూ ఇటువంటి సమావేశాలు నిర్వహించడం, విభిన్న రంగాల నిపుణులను ఆహ్వానించడం శుభ పరిణామమన్నారు. చారిత్రక, వర్తమాన అంశాలపై లోతైన అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ది హిందూ దినపత్రిక పూర్వ పాత్రికేయులు సంతోష్ పట్నాయక్, పొలిటికల్ సైన్స్, జ ర్నలిజం విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం తదితరులు ప్రసంగించారు* . *కార్యక్రమంలో ఆర్ట్స్ క ళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ ఆచార్య వి.శ్రీమన్నారాయణ, డాక్టర్ కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిధులను విభాగం తరపున సత్కరించారు.

ఆంధ్రవిశ్వవిద్యాలయం, అక్టోబర్ 23:

సమాజ ప్రగతికి పత్రికలు దోహదపడాలని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు అన్నారు. ఏయూ ఆర్ట్స్, కామర్స్ కళాశాల ఆధ్వర్యంలో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఏయూ శ తాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న సదస్సులలో భాగంగా గురువారం ఎవల్యూషన్ ఆఫ్ జ ర్నలిజం 1950 టు 2020- ద ఎరా ఆఫ్ డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ టు మోడరన్ ఇండియా ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట సమయంలో పత్రికలు కీలక భూమిక పోషించాయన్నారు* . ప్రజలను నిరంతరం చైతన్య వంతం చేయడం, స్వాతంత్య్ర స్ఫూర్తిని పెంచడంలో ఇవి ఎంతో కీలకంగా నిలచాయన్నారు. ప్రతికా రంగానికి విశేష సేవలు అందించిన హరేకృష్ణ మహతాబ్ కృషిని వివరించారు. ఒడిసా పూర్వ ముఖ్య మంత్రిగా, ఒడిసా పూర్వపు సంస్థానాలను రాష్ట్రంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఒరియాలో ఆయన ప్రారంభించి నిర్వహించిన పత్రికలు సమాజంలో ఎంతో మార్పును తీసుకురావడానికి దోహదపడ్డాయన్నారు.

ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఇంచార్జి ఉపకులపతి ఆచార్య డి.వి.ఆర్ మూర్తి మాట్లాడుతూ భారత దేశంలో జర్నిలిజం రంగంలో వచ్చిన మార్పులను వివరించారు.* సమాచారం అందించడం ప్రధాన అంశంగా జర్నలిజం ఆరంభం అయిందని నేడు దీని స్థానంలో ఎంటర్టైన్మెంట్ చేరిందన్నారు. ప త్రికా రంగం, టెలివిజన్ రంగం, నేటి డిజిటల్ రంగాలలో జరిగిన ప్రగతి, మార్పులను వివరించారు. ప త్రికల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వచ్చిన పలు చట్టాలు, ఎమర్జెన్సీ సమయంలో పత్రికల ప రిస్థితులను తెలిపారు. వాస్తవాలు, నిజంకి మధ్య వ్యత్యాసం ఉంటుందన్నారు. గాంధీజీ నడిపిన పత్రికల్లో అనేక సందర్భాలలో స్వాతంత్య్రం సాధించాలంటే సహనం అవసరమని చెప్పిన సందర్భాలను విద్యార్ధులకు వివరించారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ప్రెస్ కమీషన్ల ఏర్పాటు, దేశ అభివృద్ధికి దోహద పడిన ప్రతికలు, నెహృ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా పనిచేసిన సమయంలో పత్రికలపై వచ్చిన ఆంక్షలు, వాటిపై జరిగిన పోరాటాలు, ప్రెస్ కమీషన్లు ఏర్పాటు తదితర అంశాలు తెలియ జేశారు. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్, ఇంధిరాగాంధీ మరణం, బోపాల్ గ్యాస్ దుర్ఘటనలు దేశంలో ఎంతో ప్రముఖంగా నిలచాయన్నారు. వార్తల్లో వాస్తవాలు తగ్గిపోతున్నాయన్నారు. నేడు వార్తల్లో ఏఐ ప్రభావం పెరిగిపోతోందని, ఖచ్చితమైన సమాచారం పొందడం ప్రధానమన్నారు.

ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.నరసింహా రావు సభకు అధ్యక్షత వహించారు* . విద్యార్థులకు ఉపయుక్తంగా విభాగంలో తరచూ ఇటువంటి సమావేశాలు నిర్వహించడం, విభిన్న రంగాల నిపుణులను ఆహ్వానించడం శుభ పరిణామమన్నారు. చారిత్రక, వర్తమాన అంశాలపై లోతైన అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.

కార్యక్రమంలో ది హిందూ దినపత్రిక పూర్వ పాత్రికేయులు సంతోష్ పట్నాయక్, పొలిటికల్ సైన్స్, జ ర్నలిజం విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం తదితరులు ప్రసంగించారు* . *కార్యక్రమంలో ఆర్ట్స్ క ళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ ఆచార్య వి.శ్రీమన్నారాయణ, డాక్టర్ కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిధులను విభాగం తరపున సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.