చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
స్వామివారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే దంపతులను వేదపండితులు ఆశీర్వదించి… తీర్థప్రసాదాలు అందజేసిన టిటిడి అధికారులు.
చంద్రగిరి, పున్నమి ప్రతినిధి
చంద్రగిరి మండలం పరిధిలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులకు ఘనస్వాగతం పలికిన అర్చకులు ,టీటీడీ అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పసుపు, కుంకుమ, పండ్లు,పుష్పాలతో కూడిన పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించి …. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.ఆలయంలోని మండపంలో ఎమ్మెల్యే దంపతులను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేసిన టిటిడి అధికారులు.అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రెండవసారి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు కాసులహారం శోభాయాత్రలో పాల్గొనడం మాకు మహదానందంగా ఉంది . అనంతరం గరుడ వాహన సేవలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. వాహన సేవలో భక్తులను ,స్థానికులను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే దంపతులు. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని స్వామివారిని వేడుకునట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ,
టీటీడీ బోర్డు సభ్యులు జి. భానుప్రకాష్‌రెడ్డి ,
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు , అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు,భక్తులు పాల్గొన్నారు.


