చిట్వేలి అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం చెర్లోపల్లి గ్రామంలో గురువారం (02.10.2025) శ్రీశ్రీశ్రీ పరదేశి స్వామి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.తరువాత గ్రామంలోని మదిరి మణి స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారిని, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాచినేని విశ్వేశ్వర నాయుడు గారిని, టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల సుబ్బరాయుడు (లారీ), బాలు రామాంజులు నాయుడు, మాజీ ఎంపీటీసీ కట్టా లోకేష్ గారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ తెలుగు రైతు సంఘం అధ్యక్షులు పీకే నాయుడు, రైల్వే కోడూరు నియోజకవర్గ ఆర్టీఎస్ కో ఆర్డినేటర్ తుంగా నవీన్ కుమార్, రాజంపేట పార్లమెంట్ వాణిజ్య విభాగ కార్యదర్శి బుంగటావుల రాజశేఖర్, రైల్వే కోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బచ్చు రామచంద్రయ్య యాదవ్, యువనాయకులు ఏదోటి జ్యోతి రామ్, మదిరి యల్లయ్య, మదిరి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.


