శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీస్ సబ్ డివిజన్లు DGP హరీష్ కుమార్ గుప్తా ఆదేశలతో IGP ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ పర్యవేక్షణలో, తిరుపతి జిల్లా SP సుబ్బారాయుడు ఆద్వర్యములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పోలీసు సబ్ డివిజన్లలో శనివారం నాడు మెగా కార్డన్ &సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించబడింది. ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా శ్రీకాళహస్తి డివిజన్ లోని చల్లపాలెం BC కాలనీ నందు కూడా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు పోలీసు శాఖ వారు చేపట్టారు. ఈ మెగా కార్డ్ అండ్ సర్చ్ ఆపరేషన్ను, శ్రీకాళహస్తి సబ్ డివిజన్లో డిఎస్పీ నరసింహ మూర్తి, శ్రీకాళహస్తి రూరల్ ఇబ్రహీం, శ్రీకాళహస్తి II టౌన్ నాగరాజు, B.N కండ్రిగ తిమ్మయ్య, సి.ఐ.లు, శ్రీకాళహస్తి సబ్ డివిజన్లోని 8 మంది SI లు, 55 మంది పోలీసు సిబ్బందితో కలిసి పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ టీమ్లు కలిసి గుర్తించిన హాట్స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో పాత గంజాయి, నార్కోటిక్ కేసులలో ఉన్నటువంటి ముద్దాయిలను పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ప్రజల వివరాలు, వాహనాల వివరాలు, అనుమానాస్పద వ్యక్తులపై పరిశీలన చేపట్టారు. ఈ ఆపరేషన్లో మొత్తం 300 మంది వ్యక్తులను, 235 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 33 వాహనాలను గుర్తించి 29 బైక్ లు, 4 ఆటలను సీజ్ చేశామని ఇద్దరు సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను స్పాట్ లో పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించి ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించి గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు ప్రజలతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” నిర్వహించి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” కింద ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పొలుసు అధికారులు పేర్కొన్నారు.

శ్రీకాళహస్తిలో విజయవంతంగా ఆపరేషన్ వజ్రప్రహార్