Wednesday, 11 February 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి శోభ-విద్యుత్‌ అలంకరణలతో మెరిసిపోతున్న శివాలయం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి శోభ-విద్యుత్‌ అలంకరణలతో మెరిసిపోతున్న శివాలయం

శ్రీకాళహస్తి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం అంతట రంగురంగుల విద్యుత్‌ అలంకరణల ఏర్పాట్లతో కళకళలాడుతోంది. పట్టణ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగులు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఆలయం లోపల కూడా ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా ఉన్న ఎల్‌ఈడీ దీపాలంకరణలు స్థానిక ప్రజలను భక్తులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 10న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతున్నాయి. ప్రధానమైన మహాశివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 15, 2026న జరగనుంది. 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అలయాధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని తరిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.