Thursday, 12 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో గంజాయి సరఫరా గ్యాంగ్ బండారం బయటపెట్టిన పోలీసులు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో గంజాయి సరఫరా గ్యాంగ్ బండారం బయటపెట్టిన పోలీసులు

శ్రీకాళహస్తి పున్నమి (క్రైం) న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి పట్టణంలో గంజాయి రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి గురువారం నాడు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు అందిన గోప్య సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పారు. అందిన సమాచారం మేరకు ఎం.జి.ఎం హాస్పిటల్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా, అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కోటంబేడి రాజు (20), దుర్గాప్రసాద్ (20), వర్షిత్ (20)గా గుర్తించారు. వారి వద్ద ఉన్న సంచుల్లో రెండు కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసుల విచారణలో కోటంబేడి రాజు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి దుర్గాప్రసాద్, వర్షిత్‌లకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, నిందితులపై గతంలో వెంకటగిరి, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మరియు శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లలో దొంగతనం, గంజాయి కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.