Wednesday, 18 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో అనధికార లేఅవుట్లపై కొరడా ఝులిపిన మున్సిపల్ అధికారులు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో అనధికార లేఅవుట్లపై కొరడా ఝులిపిన మున్సిపల్ అధికారులు

శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో అనుమతులు లేకుండా వెలుస్తున్న అనధికార లేఅవుట్లపై పురపాలక సంఘం అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆదేశాల మేరకు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పానగల్ ఆర్చి సమీపంలోని సర్వే నంబర్ 204లో నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి వేసిన ఈ అక్రమ వెంచర్లను మున్సిపల్ సిబ్బంది తక్షణమే తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ.. “అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దు. నిబంధనల ప్రకారం అనుమతి లేని చోట భవన నిర్మాణాలు చేపట్టినా, అవి అక్రమ కట్టడాల కిందకే వస్తాయి. భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, ప్లాట్లు లేదా భవనాలు కొనే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలుదారులు ఏదైనా ప్లాట్ కొనే ముందు, సదరు లేఅవుట్‌కు మున్సిపల్ శాఖ నుండి సరైన అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. అనధికార లేఅవుట్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.