శ్రీకాళహస్తి (పున్నమి న్యూస్), మార్చి 11: దక్షిణ ఆమ్నాయ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి పూజ్యశ్రీ విదుశేఖర భారతీ తీర్థ స్వామీజీ బుధవారం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని సందర్శించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా విచ్చేసిన జగద్గురువులు శ్రీకాళహస్తి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య “శ్రీకాళహస్తి స్థల పురాణం” గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ గ్రంథం విశిష్టతను వివరించిన ప్రముఖులు మాట్లాడుతూ.. 1893 సంవత్సరంలో వెంకటగిరి సంస్థానాధీశులైన శ్రీశ్రీశ్రీ వెలుగోటి రాజా ముద్దుకృష్ణ యాచేంద్ర భూపాల వారి ఆధ్వర్యంలో ప్రచురితమైన సంస్కృత గ్రంథాన్ని బ్రహ్మశ్రీ చెట్లూరు వెంకటసుబ్రమణ్యం శాస్త్రి పరిష్కరించినట్లు తెలిపారు. దాదాపు 132 సంవత్సరాల తరువాత ఈ మహాగ్రంథాన్ని సంపూర్ణంగా తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారని శివపురాణాంతర్గతంగా ఉన్న శివరహస్య సంగ్రహం ఆధారంగా రూపొందిన ఈ శ్రీకాళహస్తి స్థల పురాణంలో మొత్తం 90 అధ్యాయాలు, 9,430 శ్లోకాలు ఉన్నాయి. ఐదు సంపుటాలుగా విస్తరించిన ఈ గ్రంథం సుమారు 1,700 పేజీలతో వెలువడింది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ పురాణాన్ని డాక్టర్ పాలకోడేటి జగన్నాథరావు తెలుగులో వ్యాఖ్యాన సమేతంగా ఆంధ్రీకరించారు. ప్రఖ్యాత కవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంతో పోలిస్తే ఇది విస్తృతమైన, భిన్నమైన మహాగ్రంథమని పండితులు తెలిపారు. ఈ గ్రంథం సంపాదకత్వాన్ని మాజీ కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కలెక్టర్‌గా సేవలందించిన కె.ఎస్. రామారావు నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానంతో అనుబంధం కలిగిన ఆయన సంపాదకత్వంలో రెండు సంపుటాలుగా ఈ గ్రంథం వెలువడిందని ఈ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావడంలో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన గురజాల నాగారాజ జెట్టి ప్రత్యేక కృషి చేశారు. శృంగేరి జగద్గురువుల చేతుల మీదుగా ఈ గ్రంథం ఆవిష్కరణ జరగడం క్షేత్ర చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా భక్తులు, పండితులు అభిప్రాయపడ్డారు.

132 సంవత్సరాల తరువాత తెలుగులోకి ‘శ్రీకాళహస్తి స్థల పురాణం’… జగద్గురువులచే ఆవిష్కరణ