మచిలీపట్నం (గొడుగు పేట), న్యూస్‌టుడే:
విద్యార్థులు సమాజ అవసరాలకు పరిష్కారాలు చూపే పరిశోధకులుగా ఎదగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం మచిలీపట్నంలోని లేడి యాంప్తిల్ కళాశాలలో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రారంభోత్సవంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన వసతులు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. డీఈవో సుబ్బారావు విద్యార్థులకు వైజ్ఞానిక దృక్పథం, గణిత విజ్ఞానం అత్యంత కీలకమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 196 నమూనాలు ప్రదర్శనకు వచ్చినట్లు జిల్లా సైన్సు అధికారి మహ్మ జాకీర్ అహ్మద్ తెలిపారు.
వైజ్ఞానిక దృక్పథంతో విద్యార్థుల సృజనాత్మకత
మచిలీపట్నం (గొడుగు పేట), న్యూస్‌టుడే: విద్యార్థులు సమాజ అవసరాలకు పరిష్కారాలు చూపే పరిశోధకులుగా ఎదగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం మచిలీపట్నంలోని లేడి యాంప్తిల్ కళాశాలలో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రారంభోత్సవంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన వసతులు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. డీఈవో సుబ్బారావు విద్యార్థులకు వైజ్ఞానిక దృక్పథం, గణిత విజ్ఞానం అత్యంత కీలకమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 196 నమూనాలు ప్రదర్శనకు వచ్చినట్లు జిల్లా సైన్సు అధికారి మహ్మ జాకీర్ అహ్మద్ తెలిపారు.

