పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్:
29 మార్చి 2026
*వేడుకలపై బీ ఆలర్ట్..*
• ఎక్సైజ్ నిఘా బృందాలతో తనిఖీలు..
• డిఫెన్స్, నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్, విదేశీ మద్యం, గంజాయి,డ్రగ్స్‌పై పోకస్
• అనుమతి లేని ఈవెంట్ పార్టీలపై కూడ నిఘా.
ఫంక్షన్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్, రిసార్ట్స్, ఫార్మ్ హౌస్ లలో జరిగే వేడుకల్లో డిఫెన్స్,నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ (ఇతర రాష్ట్రాల మద్యం),విదేశీ మద్యం, గంజాయి,డ్రగ్స్ వినియోగంపై అనువణువున తనిఖీలు చేపట్టడానికి సన్నాహాలు.
ఎక్సైజ్‌శాఖ నుంచి ఎస్ టి ఎఫ్ ( స్టేట్ టాస్క్ ఫోర్స్) రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్, డి టి ఎఫ్ ( సరూర్ నగర్ జిల్లా టాస్క్ ఫోర్స్), హయత్ నగర్ ఎక్సైజ్, పెద్ద అంబర్ పేట్ ఎక్సైజ్ టీమ్‌లు నిరంతర తనిఖీలు నిర్వహిస్తారు.
ప్రధానంగా ఈ టీమ్‌లు జరుపుకునే వేడుకల్లో మద్యం వినియోగం అనుమతి (Event permit ) తో పాటు తెలంగాణ మద్యం మినహా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం, డిఫెన్స్, విదేశీ మద్యం, గంజాయి,డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు, కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కోంటున్నారు.
వేడుకల్లో ఎక్సైజ్ టీమ్‌లు వినియోగించే మద్యంపై టెక్నాలజీ యాప్‌లతో తనిఖీలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
హాల్ ఓనర్స్ /రిసార్ట్ ఓనర్స్ Event permit లేకుండ events జరపడం మరియు డిఫెన్స్ లేక ఇతర రాష్ట్రాల మద్యం లేక విదేశీ మద్యం ఈవెంట్స్ లో వాడకుండ చూసుకోవడం వారి భాద్యత. ఉల్లంఘనలు జరిగిన ఆ ఫంక్షన్ హాల్ ను black list చేసి event permit ఇకముందు ఇవ్వడం జరగదు . కనుక జాగ్రత్తగా భాద్యతగా ఉండవలిసిందిగా కోరడమైనది.

