పున్నమి ప్రతినిధి,తాళ్లపూడి,(తూర్పుగోదావరి), ఏప్రిల్ 2: వేగేశ్వరపురం గ్రామ సచివాలయం-1లో వేగేశ్వరపురం పంచాయతీ పాలకవర్గం పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పదవీ కాలం పూర్తిచేసుకున్న పంచాయతీ వార్డ్ మెంబర్స్‌ను సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు సత్కరించి, వారి సేవలను కొనియాడారు. గ్రామాభివృద్ధికి వారు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
అదేవిధంగా సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావును కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శీర్ల బ్రహ్మానందం, బత్తిని నాగు, కాళ్ల రమణ, నున్న కృష్ణ, తైలం పోసయ్య, భగవాన్ అప్పాజీ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ తైలం జైయేసు, తైలం ప్రసాద్, శీర్ల నాగు, తైలం సత్యవతి, ముమ్మిడివరపు మదన్, ఎంపిటిసి లక్ష్మణరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి, గ్రామ ప్రజల మధ్య ఐక్యతను ప్రతిబింబించింది.

వేగేశ్వరపురం పంచాయతీ పాలకవర్గానికి ఘన వీడ్కోలు
పున్నమి ప్రతినిధి,తాళ్లపూడి,(తూర్పుగోదావరి), ఏప్రిల్ 2: వేగేశ్వరపురం గ్రామ సచివాలయం-1లో వేగేశ్వరపురం పంచాయతీ పాలకవర్గం పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పదవీ కాలం పూర్తిచేసుకున్న పంచాయతీ వార్డ్ మెంబర్స్‌ను సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు సత్కరించి, వారి సేవలను కొనియాడారు. గ్రామాభివృద్ధికి వారు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావును కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శీర్ల బ్రహ్మానందం, బత్తిని నాగు, కాళ్ల రమణ, నున్న కృష్ణ, తైలం పోసయ్య, భగవాన్ అప్పాజీ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ తైలం జైయేసు, తైలం ప్రసాద్, శీర్ల నాగు, తైలం సత్యవతి, ముమ్మిడివరపు మదన్, ఎంపిటిసి లక్ష్మణరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి, గ్రామ ప్రజల మధ్య ఐక్యతను ప్రతిబింబించింది.

