ఖమ్మం:మార్చి
[పున్నమి ప్రతినిధి]
వెలుగుమట్ల ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో బాధితులను పరామర్శించేందుకు కల్వకుంట్ల కవిత సోమవారం ఖమ్మంలోని అంబేద్కర్ భవన్కు విచ్చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. జరిగిన ఘటన పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు తగిన సహాయం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె శ్రద్ధగా విని, వారికి ధైర్యం చెప్పారు. సమస్యల పరిష్కారానికి తగిన విధంగా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి
Ok


