తిరుపతి: వెంకటగిరి పట్టణంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్‌ను ఆహ్వానించారు.పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు శాలువా కప్పి, సన్మానించి, శ్రీ పోలేరమ్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు.వెంకటగిరి జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ ఆహ్వానం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పోలేరమ్మ ఆలయ దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


