Saturday, 28 February 2026
  • Home  
  • వృత్తి జీవితం – 9 వ్యాపార మర్యాదలు (బిజినెస్‌ ఎటికెట్‌)
- Featured - బిజినెస్

వృత్తి జీవితం – 9 వ్యాపార మర్యాదలు (బిజినెస్‌ ఎటికెట్‌)

ముందుగా, ‘పున్నమి ‘ పాఠకులకు 2020 శుభాకాంక్షలు. 2020లో మీ జీవితం – ఆనందంగా, అర్ధవంతంగా, నాలుగు డబ్బులకు లోటు లేకుండా, హాయిగా సాగాలని కోరుకుంటూ ఈ వారం ఆర్టికల్‌. ఇంగ్లిష్‌లో బిజినెస్‌ ఎటికెట్‌ అనే ఒక పదం ఉంది. అంటే, మనం పని చేసే ఉద్యోగంలో / వ్యాపారంలో, దీసెంట్‌గా, హుందాగా, మర్యాద గా ప్రవర్తించాల్సిన నియమావళి అన్న మాట . వీటిని ఎక్కడా రాయరు. ఎవ్వరూ చెప్పరు. కళాశాలలో నేర్పించరు. కంపెనీ పాలసీలలో ఉండవు. వీటిని ‘అన్‌ రిటెన్‌ రూల్స్‌’ అంటారు. వీటిని పాటిస్తే, మనతో కలిసి పని చేసే వారు మనతో సమయం గడపడానికి ఇష్ట పడతారు. మనకి కావల్సిన కీలకమైన సమాచారంతో, సరి అయిన టైంలో పంచుకుంటారు. మనకి అవసరమైన హెచ్చరికలు చేస్తారు. ‘వ్యాపార మర్యాద’ లు మనం పాటించక పోతే, అవతలి వారు మనని ‘ కేవలం భరిస్తారు’. మన అవసరం అయి పోగానే దూరం పెడతారు. అవి ఏమిటో చూద్దాం . (1) ఎవరికైనా కాల్‌ చేసేటప్పుడు : రెండు సార్ల కంటె ఎక్కువ కాల్‌ చెయ్యకండి . మీరు 2 సార్లు కాల్‌ చేసినా వారు కాల్‌ తీసుకోవడం లేదంటే, కావాలని కావచ్చు , లేదా మరే పని లో అయినా బిజీగా ఉండి ఉండవచ్చు. మీరు ఏ పని మీద వారికి కాల్‌ చేశారో , చిన్న మెసేజి పెట్టండి. ఎస్సెమ్మెస్‌లోనో, లేక వాట్సాప్‌లోనో. మీరు సేల్స్‌లో ఉన్నారు అనుకోండి. వ్యాపారం కోసం చేసే కాల్స్‌కి పై సూత్రం వర్తిస్తుంది . కానీ, క్యాష్‌ కలెక్షన్‌ దగ్గర వర్తించదు! మన దగ్గర సరుకు తీసుకుని, అమ్ముకుని, మనకి డబ్బులు ఇవ్వడానికి డిలే చేస్తున్నారు అంటే, మనం 100 కాల్స్‌ చేసినా, తప్పు లేదు. ఇంటికి / దుకాణానికి వెళ్ళి, వెయిట్‌ చేసి పట్టుకుని అడిగినా తప్పు లేదు. ప్రతి రూల్‌ కీ కొన్ని మినహాయింపులు ఉంటాయి అన్న మాట! (2) అప్పు తీసుకోవడం, ఇవ్వడం, తిరిగి ఇవ్వడం : వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా వ్యాపారస్తుల నుంచి, సగటు జీవి వరకూ, మనిషి కి అప్పు చేసే పరిస్థితి వస్తుంది! వ్యాపార జీవితం లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ. అది మనకు ఇష్టం ఉండదు, కానీ కొన్ని సార్లు తప్పదు. మీరు గనక వ్యక్తిగత జీవితం లో అప్పు తీసుకుంటే, ఆ ఇచ్చిన వారు తిరిగి మనకి గుర్తు చేసే లోపల మీరు తిరిగి ఇవ్వండి ! ఇది మర్యాద చిహ్నం ! ఒక వేళ మీరు ప్రామిస్‌ చేసిన రోజు ఇవ్వ లేక పోతే , మనకి రెండు ఛాయిస్‌ లు ఉంటాయి . ఒకటి , మనం కమిట్‌ చేసిన డేట్‌ కి 2 లేక మూడు రోజుల ముందే, ‘ సారీ ‘ చెప్పి , మరి కొన్ని రోజులు పట్టేలా ఉంది అని చెప్పడం . రెండవది, పాక్షికం గా తిరిగి ఇవ్వడం . ‘ ఇదిగో సురేష్‌ ! నేను చెప్పిన 20 వేలూ ఇప్పుడు ఒక్క సారి గా ఇచ్చే పరిస్థితి లేదు . ఇప్పుడు రూ . 5 వేలు ఇస్తాను, మిగతాది వచ్చే నెలలో . తీసుకో, నాకు కొంచెం భారం తగ్గినట్లు ఉంటుంది ! ‘ అని . అర్ధం చేసుకుంటారు . మొహం చాటు వేయవద్దు ! మీరు అప్పు ఇచ్చే పక్షంలో : అప్పు ఇచ్చి స్నేహాన్ని పాడు చేసుకోకండి ! అలా అంటే అప్పు ఇవ్వ వద్దు అని కాదు ! అవసరానికి సాయ పడక పోతే స్నేహం ఎందుకు? ఎంత మొత్తం ఇవ్వాలి ? : తీసుకున్న వ్యక్తి చెప్పిన డేటు కి సర్ద లేక పోయినా , తిరిగి ఇవ్వడానికి చాలా కాలం పట్టేటట్లు ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బంది లేనంత చిన్న మొత్తం మాత్రమే ఇవ్వండి ! కానీ, పలుసార్లు అడిగి, తీసుకున్న వారు మొహం చాటేసే పరిస్థితి కల్పించ వద్దు ! మరొక విషయం : అవతలి వారు అడిగినంత మీరు ఇవ్వ లేక పోయినా, పాక్షికం గా సాయం చెయ్యండి. ‘ బాసూ ! నువ్వడినీ 50 వేలు నేను ఇచ్చే పరిస్థితి లేదు. నాకు బ్లాక్‌ అయి పోతుంది. నేను ఇప్పుడు 15 వేలు ఇవ్వ గలను . మిగతా 35 వేలు, మరెక్కడన్నా ట్రై చెయ్యి ! ‘ ఇలా. ఇంకో విషయం ! మీరు ఆ స్నేహితునికి అప్పు ఇచ్చినట్లు ఎవరికీ చెప్ప వద్దు ! మీరు గనక అప్పు ఇస్తే, భారం లేని మొత్తమే ఇవ్వండి . అవతలి వారు ఎప్పుడు ఇచ్చినా తీసుకునే దానికి సిద్ధం గా ఉండండి . అలా కుదరక పోతే, అసలు అప్పే ఇవ్వకండి .ఇది, వ్యక్తిగత జీవితంలో పాటించ వలసినీ ‘ వ్యాపార ‘ మర్యాద . ఈ టాపిక్‌ పైన మరొక్క ముఖ్య విషయం . ‘వడ్డీ’ కి ఇవ్వకండి, స్నేహితులకు, చుట్టాలకు, మీ పనిమనుషులకు. ప్రేమగా సాయం చేయ వలసిన చోట, దాని నుంచి ‘లాభ’ పడడానికి ప్రయత్నించకండి. మరిన్ని వ్యాపార మర్యాదలు, వచ్చే సంచికలో సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా: punnami. news@ gmail. com, essence. training @yahoo.com.

ముందుగా, ‘పున్నమి ‘ పాఠకులకు 2020 శుభాకాంక్షలు. 2020లో మీ జీవితం – ఆనందంగా, అర్ధవంతంగా, నాలుగు డబ్బులకు లోటు లేకుండా, హాయిగా సాగాలని కోరుకుంటూ ఈ వారం ఆర్టికల్‌. ఇంగ్లిష్‌లో బిజినెస్‌ ఎటికెట్‌ అనే ఒక పదం ఉంది. అంటే, మనం పని చేసే ఉద్యోగంలో / వ్యాపారంలో, దీసెంట్‌గా, హుందాగా, మర్యాద గా ప్రవర్తించాల్సిన నియమావళి అన్న మాట .
వీటిని ఎక్కడా రాయరు. ఎవ్వరూ చెప్పరు. కళాశాలలో నేర్పించరు. కంపెనీ పాలసీలలో ఉండవు. వీటిని ‘అన్‌ రిటెన్‌ రూల్స్‌’ అంటారు.
వీటిని పాటిస్తే, మనతో కలిసి పని చేసే వారు మనతో సమయం గడపడానికి ఇష్ట పడతారు. మనకి కావల్సిన కీలకమైన సమాచారంతో, సరి అయిన టైంలో పంచుకుంటారు. మనకి అవసరమైన హెచ్చరికలు చేస్తారు.
‘వ్యాపార మర్యాద’ లు మనం పాటించక పోతే, అవతలి వారు మనని ‘ కేవలం భరిస్తారు’. మన అవసరం అయి పోగానే దూరం పెడతారు.
అవి ఏమిటో చూద్దాం .
(1) ఎవరికైనా కాల్‌ చేసేటప్పుడు : రెండు సార్ల కంటె ఎక్కువ కాల్‌ చెయ్యకండి . మీరు 2 సార్లు కాల్‌ చేసినా వారు కాల్‌ తీసుకోవడం లేదంటే, కావాలని కావచ్చు , లేదా మరే పని లో అయినా బిజీగా ఉండి ఉండవచ్చు. మీరు ఏ పని మీద వారికి కాల్‌ చేశారో , చిన్న మెసేజి పెట్టండి. ఎస్సెమ్మెస్‌లోనో, లేక వాట్సాప్‌లోనో.
మీరు సేల్స్‌లో ఉన్నారు అనుకోండి. వ్యాపారం కోసం చేసే కాల్స్‌కి పై సూత్రం వర్తిస్తుంది . కానీ, క్యాష్‌ కలెక్షన్‌ దగ్గర వర్తించదు! మన దగ్గర సరుకు తీసుకుని, అమ్ముకుని, మనకి డబ్బులు ఇవ్వడానికి డిలే చేస్తున్నారు అంటే, మనం 100 కాల్స్‌ చేసినా, తప్పు లేదు. ఇంటికి / దుకాణానికి వెళ్ళి, వెయిట్‌ చేసి పట్టుకుని అడిగినా తప్పు లేదు.
ప్రతి రూల్‌ కీ కొన్ని మినహాయింపులు ఉంటాయి అన్న మాట!
(2) అప్పు తీసుకోవడం, ఇవ్వడం, తిరిగి ఇవ్వడం : వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా వ్యాపారస్తుల నుంచి, సగటు జీవి వరకూ, మనిషి కి అప్పు చేసే పరిస్థితి వస్తుంది! వ్యాపార జీవితం లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ. అది మనకు ఇష్టం ఉండదు, కానీ కొన్ని సార్లు తప్పదు.
మీరు గనక వ్యక్తిగత జీవితం లో అప్పు తీసుకుంటే, ఆ ఇచ్చిన వారు తిరిగి మనకి గుర్తు చేసే లోపల మీరు తిరిగి ఇవ్వండి ! ఇది మర్యాద చిహ్నం ! ఒక వేళ మీరు ప్రామిస్‌ చేసిన రోజు ఇవ్వ లేక పోతే , మనకి రెండు ఛాయిస్‌ లు ఉంటాయి . ఒకటి , మనం కమిట్‌ చేసిన డేట్‌ కి 2 లేక మూడు రోజుల ముందే, ‘ సారీ ‘ చెప్పి , మరి కొన్ని రోజులు పట్టేలా ఉంది అని చెప్పడం . రెండవది, పాక్షికం గా తిరిగి ఇవ్వడం . ‘ ఇదిగో సురేష్‌ ! నేను చెప్పిన 20 వేలూ ఇప్పుడు ఒక్క సారి గా ఇచ్చే పరిస్థితి లేదు . ఇప్పుడు రూ . 5 వేలు ఇస్తాను, మిగతాది వచ్చే నెలలో . తీసుకో, నాకు కొంచెం భారం తగ్గినట్లు ఉంటుంది ! ‘ అని . అర్ధం చేసుకుంటారు . మొహం చాటు వేయవద్దు !
మీరు అప్పు ఇచ్చే పక్షంలో : అప్పు ఇచ్చి స్నేహాన్ని పాడు చేసుకోకండి ! అలా అంటే అప్పు ఇవ్వ వద్దు అని కాదు ! అవసరానికి సాయ పడక పోతే స్నేహం ఎందుకు? ఎంత మొత్తం ఇవ్వాలి ? : తీసుకున్న వ్యక్తి చెప్పిన డేటు కి సర్ద లేక పోయినా , తిరిగి ఇవ్వడానికి చాలా కాలం పట్టేటట్లు ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బంది లేనంత చిన్న మొత్తం మాత్రమే ఇవ్వండి ! కానీ, పలుసార్లు అడిగి, తీసుకున్న వారు మొహం చాటేసే పరిస్థితి కల్పించ వద్దు !
మరొక విషయం : అవతలి వారు అడిగినంత మీరు ఇవ్వ లేక పోయినా, పాక్షికం గా సాయం చెయ్యండి. ‘ బాసూ ! నువ్వడినీ 50 వేలు నేను ఇచ్చే పరిస్థితి లేదు. నాకు బ్లాక్‌ అయి పోతుంది. నేను ఇప్పుడు 15 వేలు ఇవ్వ గలను . మిగతా 35 వేలు, మరెక్కడన్నా ట్రై చెయ్యి ! ‘ ఇలా.
ఇంకో విషయం ! మీరు ఆ స్నేహితునికి అప్పు ఇచ్చినట్లు ఎవరికీ చెప్ప వద్దు !
మీరు గనక అప్పు ఇస్తే, భారం లేని మొత్తమే ఇవ్వండి . అవతలి వారు ఎప్పుడు ఇచ్చినా తీసుకునే దానికి సిద్ధం గా ఉండండి . అలా కుదరక పోతే, అసలు అప్పే ఇవ్వకండి .ఇది, వ్యక్తిగత జీవితంలో పాటించ వలసినీ ‘ వ్యాపార ‘ మర్యాద .
ఈ టాపిక్‌ పైన మరొక్క ముఖ్య విషయం . ‘వడ్డీ’ కి ఇవ్వకండి, స్నేహితులకు, చుట్టాలకు, మీ పనిమనుషులకు. ప్రేమగా సాయం చేయ వలసిన చోట, దాని నుంచి ‘లాభ’ పడడానికి ప్రయత్నించకండి. మరిన్ని వ్యాపార మర్యాదలు, వచ్చే సంచికలో సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా: punnami. news@ gmail. com, essence. training @yahoo.com.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.