పున్నమి న్యూస్
24 ఫిబ్రవరి 2026
వీధి కుక్కల దాడిలో.. ఆవుదూడ మృతి..?
యాచారం మండలం నజ్దిక్ సింగారంలో వీధి కుక్కల బారిన పడి ఆవుదూడ మృతి చెందిందని రైతు కడారి జంగయ్య తెలిపాడు. తన వ్యవసాయ పొలంలో రోజులాగే ఆవులు, దూడలను కట్టేసి వెళ్ళానన్నాడు. రాత్రి వీధి కుక్కల దాడిలో ఆవు దూడ మృతి చెందిందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదన్నారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.




