Thursday, 12 February 2026
  • Home  
  • విశాఖ ఉక్కు సమస్యలు పరిష్కరించాలి
- ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కు సమస్యలు పరిష్కరించాలి

స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించాలి స్టీల్ ప్లాంట్, (పున్నమి ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించడంలో మీరు చొరవ చూపాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు బుధవారం పార్లమెంట్ సభ్యులకు విన్నవించారు. పార్లమెంట్ సభ్యుల పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసిన సభ్యులను నగరంలో కలిసి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలోనే సముద్రతీర ప్రాంతంలో గల ఏకైక ఉక్కు పరిశ్రమ ఇది ఒకటే అని వారు అన్నారు. దీనిని రక్షించుకొని దేశీయ ఉక్కు ఎగుమతులను మరింత ప్రోత్సహించడం ద్వారా దేశ సంపద మరింత అభివృద్ధి జరుగుతుందని వారు వివరించారు. నేడు కేంద్ర ప్రభుత్వం దీనిని రక్షించడం కోసం 11400 కోట్ల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వం 2600 కోట్ల రూపాయలను అందించినప్పటికీ సొంత గనులు లేకపోవడంతో దీని ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోందని దీనివల్ల లాభాల స్థానంలో నష్టాలు వస్తున్నాయని వారు వివరించారు. దీనికి పరిష్కారం సొంత గనులు కేటాయించడం లేదా సెయిల్ లో విలీనం చేసి రా మెటీరియల్ కష్టాలను తగ్గించడం సాధ్యపడుతుందని వారు అన్నారు. నేటి స్టీల్ యాజమాన్యం అనాలోచితి నిర్ణయాలతో ఉత్పత్తి వ్యయం మరింత పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.స్టీల్ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలను మరింత అధికం చేస్తుందని వారు అన్నారు. కార్మికులు 2012 జీతాలను, అధికారులు 2007 జీతాలను తీసుకుంటున్నప్పటికీ ఆ జీతాలలో కోతలు విధిస్తోందని అన్నారు. ఇదే కాకుండా కార్మికులకు హెచ్ఆర్ఏ నిలుపుదల చేశారని, ఉక్కు నగరంలో నివసిస్తున్న వారికి ఎక్కడా లేని విధంగా యూనిట్ కరెంటు చార్జీలను అత్యధికంగా పెంచివేశారని, చివరకు 24 గంటలు అందుబాటులో ఉంచవలసిన క్యాంటీన్ సౌకర్యాన్ని కూడా నిలుపుదల చేశారని వారు వివరించారు. ఇలా కార్మికులను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఈ వైఖరిని ప్రశ్నిస్తే వారిపై నిర్బంధంతోపాటు శాఖ పరమైన చర్యలతో భయాందోళనలను సృష్టిస్తున్నారని వారు అన్నారు. కనుక ఈ విషయంలో మీరు దృష్టి సారించి ఈ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించి స్టీల్ మంత్రిత్వ శాఖకు తగిన సూచనలు అందించాలని వారు అభ్యర్థించారు. ఎస్ రాధా మోహన్ సింగ్ చైర్ పర్సన్, కామ్రేడ్ వి సల్వరాజ్, జ్యోతి మణి, శ్రీ జగదీష్ షట్టర్, రాజీవ్ భరద్వాజ్, ముజిబుల్లా ఖాన్, బిష్ణు పండారాయ్ పార్లమెంటు సభ్యులను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె అయోధ్యరామ్, దాలినాయుడు, సురేష్ బాబు, జె రామకృష్ణ, ఎల్ వి రమణ కలిశారు.

స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించాలి

స్టీల్ ప్లాంట్, (పున్నమి ప్రతినిధి)

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించడంలో మీరు చొరవ చూపాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు బుధవారం పార్లమెంట్ సభ్యులకు విన్నవించారు. పార్లమెంట్ సభ్యుల పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసిన సభ్యులను నగరంలో కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలోనే సముద్రతీర ప్రాంతంలో గల ఏకైక ఉక్కు పరిశ్రమ ఇది ఒకటే అని వారు అన్నారు. దీనిని రక్షించుకొని దేశీయ ఉక్కు ఎగుమతులను మరింత ప్రోత్సహించడం ద్వారా దేశ సంపద మరింత అభివృద్ధి జరుగుతుందని వారు వివరించారు. నేడు కేంద్ర ప్రభుత్వం దీనిని రక్షించడం కోసం 11400 కోట్ల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వం 2600 కోట్ల రూపాయలను అందించినప్పటికీ సొంత గనులు లేకపోవడంతో దీని ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోందని దీనివల్ల లాభాల స్థానంలో నష్టాలు వస్తున్నాయని వారు వివరించారు. దీనికి పరిష్కారం సొంత గనులు కేటాయించడం లేదా సెయిల్ లో విలీనం చేసి రా మెటీరియల్ కష్టాలను తగ్గించడం సాధ్యపడుతుందని వారు అన్నారు. నేటి స్టీల్ యాజమాన్యం అనాలోచితి నిర్ణయాలతో ఉత్పత్తి వ్యయం మరింత పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
స్టీల్ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలను మరింత అధికం చేస్తుందని వారు అన్నారు. కార్మికులు 2012 జీతాలను, అధికారులు 2007 జీతాలను తీసుకుంటున్నప్పటికీ ఆ జీతాలలో కోతలు విధిస్తోందని అన్నారు. ఇదే కాకుండా కార్మికులకు హెచ్ఆర్ఏ నిలుపుదల చేశారని, ఉక్కు నగరంలో నివసిస్తున్న వారికి ఎక్కడా లేని విధంగా యూనిట్ కరెంటు చార్జీలను అత్యధికంగా పెంచివేశారని, చివరకు 24 గంటలు అందుబాటులో ఉంచవలసిన క్యాంటీన్ సౌకర్యాన్ని కూడా నిలుపుదల చేశారని వారు వివరించారు. ఇలా కార్మికులను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఈ వైఖరిని ప్రశ్నిస్తే వారిపై నిర్బంధంతోపాటు శాఖ పరమైన చర్యలతో భయాందోళనలను సృష్టిస్తున్నారని వారు అన్నారు. కనుక ఈ విషయంలో మీరు దృష్టి సారించి ఈ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించి స్టీల్ మంత్రిత్వ శాఖకు తగిన సూచనలు అందించాలని వారు అభ్యర్థించారు. ఎస్ రాధా మోహన్ సింగ్ చైర్ పర్సన్, కామ్రేడ్ వి సల్వరాజ్, జ్యోతి మణి, శ్రీ జగదీష్ షట్టర్, రాజీవ్ భరద్వాజ్, ముజిబుల్లా ఖాన్, బిష్ణు పండారాయ్ పార్లమెంటు సభ్యులను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె అయోధ్యరామ్, దాలినాయుడు, సురేష్ బాబు, జె రామకృష్ణ, ఎల్ వి రమణ కలిశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.