నిర్మల్ జిల్లా, ముధోల్ నియోజకవర్గంలోని బైంసా మండలం వానల్ పహాడ్ గ్రామంలో గత సంవత్సరం చింతచెట్టులో వెలసిన విజయదుర్గమ్మ మహిమపై భక్తుల విశ్వాసం రోజురోజుకు పెరుగుతోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గత సంవత్సరం అమ్మవారిని దర్శించుకున్న అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరినట్టు చెబుతున్నారు. ప్రత్యేకంగా, గత సంవత్సరం కట్టిన మూడు పూలను ఈ రోజు భక్తులు తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు అమ్మవారి మహిమను గాఢంగా విశ్వసిస్తూ, మాత కరుణ అనుభవిస్తున్నామని తెలిపారు.
ప్రతిరోజూ ఈ పవిత్ర స్థలానికి పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు తరలివస్తున్నారు. పూజలు, వ్రతాలతో పాటు నిరంతరంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతుండటంతో వానపాడు గ్రామం భక్తుల ఆరాధన కేంద్రంగా మారింది.
గ్రామస్థులు మాట్లాడుతూ – విజయదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం, దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. అమ్మవారి మహిమ దేశమంతటా వ్యాప్తి చెందాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


