Sunday, 22 March 2026
  • Home  
  • *వడ్డె ఓబన్న సేవలు ఎనలేనివి – వడ్డెర్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది*
- ఎన్ టి ఆర్ జిల్లా

*వడ్డె ఓబన్న సేవలు ఎనలేనివి – వడ్డెర్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది*

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో వడ్డె ఓబన్న విగ్రహావి ష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. స్వాతంత్ర్య పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కు అంగరక్షకుడు, సైన్యాధ్యక్షుడు గా సేవలందిం చిన వడ్డె ఓబన్న వీరోచిత పోరాటం దేశ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ తదితరులు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సభలో బ్రిటీష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వడ్డె ఓబన్న యోధుడిగా గుర్తింపు పొందారు. ఎమ్మెల్యే రామరాజగోపాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వడ్డెర్ల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ, యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ వడ్డె ఓబన్న త్యాగం వడ్డెర్ల సమాజా నికి ప్రేరణగా నిలుస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తు న్నట్టు అన్నారు. కేడీసీసీబ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ తక్కువ వడ్డీ రుణాలు, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు జోరుగా ముందడు గు వేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు విశిష్ట నేతలు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు హాజరై విగ్రహానికి పూలమాలలు కూర్చుతూ నివాళులు అర్పించి ఘనంగా జరుపుకున్నారు.

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో వడ్డె ఓబన్న విగ్రహావి ష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. స్వాతంత్ర్య పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కు అంగరక్షకుడు, సైన్యాధ్యక్షుడు గా సేవలందిం చిన వడ్డె ఓబన్న వీరోచిత పోరాటం దేశ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ తదితరులు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సభలో బ్రిటీష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వడ్డె ఓబన్న యోధుడిగా గుర్తింపు పొందారు. ఎమ్మెల్యే రామరాజగోపాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వడ్డెర్ల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ, యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు.
ఎంపీ కేశినేని శివనాథ్ వడ్డె ఓబన్న త్యాగం వడ్డెర్ల సమాజా నికి ప్రేరణగా నిలుస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తు న్నట్టు అన్నారు. కేడీసీసీబ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ తక్కువ వడ్డీ రుణాలు, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు జోరుగా ముందడు గు వేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమానికి పలు విశిష్ట నేతలు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు హాజరై విగ్రహానికి పూలమాలలు కూర్చుతూ నివాళులు అర్పించి ఘనంగా జరుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.