*వందేమాతర స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించాల్సిన భాద్యత నేటి తరంఫై ఉంది: ఈస్ట్ కోస్ట్ రైల్వే కాన్స్టక్షన్స్ చీఫ్ అడ్మినిస్ట్రెటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్తా*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 7న ఉదయం 9:50 గంటలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సందర్బంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే కన్స్ట్రక్షన్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్త ఆధ్వర్యంలో విశాఖపట్నం కార్యాలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్త, చీఫ్ ఇంజినీర్ -I శ్రీనివాసరావు, చీఫ్ ఇంజినీర్ -III విష్ణుమూర్తి తో పాటు ఇతర నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు.
అనంతరం సిఎఓ అంకుష్ గుప్తా మాట్లాడుతూ వందేమాతర గీతం నేడు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చారిత్రక సందర్భంలో దేశ వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం ప్రతీ భారతీయుడు గర్వం గా భావించాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ఐక్యత,దేశభక్తి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.


