
సీపన్నాయుడు పేట సర్వీస్ రోడ్, ఎన్.హెచ్.-16, విజయ ఆదిత్య పార్క్ ప్రక్కన, శ్రీకాకుళంలో నూతనంగా లలిత క్రాకర్స్ ప్రారంభించిన వక్తలు,ప్రముఖులు.
ముఖ్య అతిధులుగా మాజీ శ్రీకాకుళం మున్సిపల్ చైర్ పెర్సన్ ఎంవి. పద్మావతి, వైసిపి యువ నాయకులు ధర్మాన. రామ్ మనోహర్ నాయుడు, పాల్గొని నూతన లలిత క్రాకర్స్ ను ప్రారంభించి మాట్లాడుతూ వివాహాది శుభకార్యములకు, వేడుకలకు వేదిక లలిత క్రాకర్స్ అని, అన్ని రకముల క్రాకర్స్ హోల్ సేల్ ధరలకే లభిస్తున్నాయని, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే సరసమైన ధరలకు విక్రయిస్తున్నారన్నారు. సనపల కృష్ణంరాజు ఆధ్వర్యంలో ప్రజలకు సహకారమందిస్తున్నారని ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలిపారు.
అనంతరం ప్రముఖులకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలను అందించి సత్కరించారు. సనపల కృష్ణంరాజు మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అన్ని రకాల క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయని, పేద ప్రజలకు సరసమైన ధరలకు రోజులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సనపల కృష్ణంరాజు ప్రోప్రైటర్, రాయపల్లి శివప్రసాద్ (బుజ్జి), గంటల సురేష్ (స్వామి), నగర ప్రముఖులు, వక్తలు, సేవకులు ఉర్లం. శివతేజ పట్నాయక్ స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

