Friday, 3 April 2026
  • Home  
  • లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రాలను పంపిణీ చేసిన డాక్టర్ కందులనాగరాజు
- విశాఖపట్నం

లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రాలను పంపిణీ చేసిన డాక్టర్ కందులనాగరాజు

లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రాలను పంపిణీ చేసిన డాక్టర్ కందుల *విశాఖపట్నం డిసెంబర్ 23 పున్నమి ప్రతినిధి* ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సబ్బవరం మండలం గంగవరం ప్రాంతంలో ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి 46 మంది లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అందజేశారు. అల్లిపురం నేరెళ్ల కోనేరు డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సొంతింటి కల నిజం చేయాలని కోటి సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు నేడు 46 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేయడం జరిగింది అన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం సొంత ఇంటి కల నిజం చేయడంలో ముందుందని తెలియజేశారు. ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని పేర్కొన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుందని వెల్లడించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వంతో పోలిస్తే నేటి ఎక్కువగా ప్రభుత్వం ప్రజలకు ఎక్కువగా మంచి చేస్తుందని తెలిపారు. పార్టీలు కచ్చితంగా అన్ని వర్గాలకు చేయూతనందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖ అభివృద్ధి కూడా జోరందుకుందని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 32వ వార్డు అభివృద్ధికి కూడా తన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఎం.ఎం.నాయుడు, రాజశేఖర్, కృష్ణమూర్తి, కేదార్ లక్ష్మి, ఎంఎల్ఎన్ రావు ,వెంకట్ లక్ష్మి, కృష్ణ కే.అప్పారావు, వై.ఆది బాబు, సిపిఐ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రాలను పంపిణీ చేసిన డాక్టర్ కందుల
*విశాఖపట్నం డిసెంబర్ 23 పున్నమి ప్రతినిధి*
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సబ్బవరం మండలం గంగవరం ప్రాంతంలో ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి 46 మంది లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అందజేశారు.
అల్లిపురం నేరెళ్ల కోనేరు డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సొంతింటి కల నిజం చేయాలని కోటి సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు నేడు 46 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేయడం జరిగింది అన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం సొంత ఇంటి కల నిజం చేయడంలో ముందుందని తెలియజేశారు.
ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని పేర్కొన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుందని వెల్లడించారు.
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు.
గత వైసిపి ప్రభుత్వంతో పోలిస్తే నేటి ఎక్కువగా ప్రభుత్వం ప్రజలకు ఎక్కువగా మంచి చేస్తుందని తెలిపారు.
పార్టీలు కచ్చితంగా అన్ని వర్గాలకు చేయూతనందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని వెల్లడించారు.
ఈ క్రమంలో విశాఖ అభివృద్ధి కూడా జోరందుకుందని తెలిపారు.
దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 32వ వార్డు అభివృద్ధికి కూడా తన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఈ ఎం.ఎం.నాయుడు, రాజశేఖర్, కృష్ణమూర్తి, కేదార్ లక్ష్మి, ఎంఎల్ఎన్ రావు ,వెంకట్ లక్ష్మి, కృష్ణ
కే.అప్పారావు, వై.ఆది బాబు, సిపిఐ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.