రైల్వేకోడూరు, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి)
రైల్వేకోడూరు పట్టణం హిమాంసాహెబ్ వీధి నివాసి, మాద ఫర్నీచర్ యజమాని మాద శ్రీనివాస్ నిన్న రాత్రి మృతి చెందారు.ఈ రోజు బుధవారం ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బత్యాల చంగల్ రాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు సన్నిహితులు పాల్గొన్నారు.


