పున్నమి ప్రతి నిధి
రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో విశేష సేవలందించిన పలువురికి పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం లో భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరావ్, ముప్ప వరపు హర్ష వర్ధన్ లు పాల్గొన్నారు
ఈ సం ధర్భముగా
ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ
ఈ స్ఫూర్తిని 15 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, వారికి చేదోడుగా నిలుస్తున్న శ్రీ ముప్పవరపు హర్షవర్ధన్‌లకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ కొసరాజు చంద్రశేఖర్ రావు, “భూమిరత్న” బిరుదును పొందిన భూమి హక్కుల కార్యకర్త శ్రీ ఎం. సునీల్ కుమార్, “కృషిరత్న” బిరుదును అందుకున్న చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వాహణాధికారి శ్రీ జొన్నలగడ్డ చంద్రశేఖర (JACS) రావులకు సహా రైతు, శాస్త్రవేత్త, నూతన ఆవిష్కరణలు, విస్తరణ విభాగాల్లో పురస్కారాలు అందుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
రైతుల కష్టం లోకానికి అవసరం అయినప్పటికీ, వారికి సంఘటిత శక్తి లేకపోవడం వల్ల తగిన ప్రాధాన్యత దక్కడం లేదని పేర్కొన్నారు. పట్టణాలు, పరిశ్రమలతోపాటు గ్రామాలు, వ్యవసాయ రంగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
పోషకాహార లోపం (Hidden Hunger) నివారణకు, ఎం.ఎస్. స్వామినాథన్ స్ఫూర్తిని తీసుకొని, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి సిరిధాన్యాల ఉత్పత్తికి ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. యువతరాన్ని ఈ దిశగా చైతన్యవంతం చేయడం అవసరమని అన్నారు.
అదే విధంగా రైతులు వ్యవసాయం మాత్రమే కాకుండా అనుబంధ రంగాలపైనా దృష్టి పెట్టి, పరస్పరం సమస్యలను పంచుకొని సంఘటితంగా పరిష్కారాలను అన్వేషించాలన్నారు. అప్పుడే రైతు స్వావలంబన సాధ్యమవుతుందని వెంకయ్య పేర్కొన్నారు.


