ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
రాజమహేద్రవరం :
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని,మాట నిలుపుకోవడానికి నిరంతరం కృషి చేస్తుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. తమను కుటుంబ సభ్యులుగా భావించి ఎన్నికల్లో తమ ఘన విజయానికి కారకులైనవారందరికి తాము సహయ సహకారాలు అందించగలమని ఆయన హామీ ఇచ్చారు. రూ.10 లక్షల వ్యయంతో 43వ వార్డులోని ఆయేషా మసీదుకు అవసరమైన షెడ్డు నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సమయంలో తొలుత ఈ మసీదులో ఇఫ్తార్ విందు ఇచ్చి మిగతా వాటిని సందర్శించడం తమకు సెంటిమెంటు అని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో తన సతీమణి ఇదిరెడ్డి భవానీ పోటీ చేస్తున్న సమయంలో ఈ మసీదు పెద్దలు తమను కుటుంబ సభ్యులుగా ఎంతో ఆదరించి భవాని ఘన విజయానికి తమవంతు కృషి చేశారని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు తప్ప తప్ప వారికి అవసరమైన షెడ్డు కోసం అడగలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తాము ఇచ్చిన మాకు కట్టబడి ఉంటామని వారెవరూ అడగక పోయినా తమ భవానీ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, 45 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. 43 వ వార్డు కంటిపూడి శ్రీనివాస్ అమ్మవారి గుడి అభివృద్ధి గురించి అడిగారని ముందు ఇచ్చిన మాట ప్రకారం మసీదు షెడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. రాజేంద్రనగర్ మసీదుకు పొజిషన సర్టిఫికెట్ గురించి కృషి చేశామని తమ భవాని చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.లక్ష ఇచ్చామని తన మిత్రులు చెరో రూ.50 వేలు ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తమను ఆదరించి గెలిపిస్తున్న ప్రజలకు. ప్రభుత్వ పరంగాను,తమ భవానీ చారిటబుల్ ట్రస్టు ద్వారాను ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వి శంకర్, ముస్లిం మైనారిటీ నాయకులు చాన్ బాషా, ఎస్ కె బషీర్, అస్లాం, ఎండీ బాబా ఖాన్ (ఖాన్ భాయ్), అప్సరీ, రఫీ, ఎండీ షాజన్,అహ్మద్ ఉనిషా, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రూ.10 లక్షల వ్యయంతో 43వ వార్డులో ఆయేషా మసీదు షెడ్డుకు శంకుస్థాపన.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేద్రవరం : ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని,మాట నిలుపుకోవడానికి నిరంతరం కృషి చేస్తుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. తమను కుటుంబ సభ్యులుగా భావించి ఎన్నికల్లో తమ ఘన విజయానికి కారకులైనవారందరికి తాము సహయ సహకారాలు అందించగలమని ఆయన హామీ ఇచ్చారు. రూ.10 లక్షల వ్యయంతో 43వ వార్డులోని ఆయేషా మసీదుకు అవసరమైన షెడ్డు నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సమయంలో తొలుత ఈ మసీదులో ఇఫ్తార్ విందు ఇచ్చి మిగతా వాటిని సందర్శించడం తమకు సెంటిమెంటు అని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో తన సతీమణి ఇదిరెడ్డి భవానీ పోటీ చేస్తున్న సమయంలో ఈ మసీదు పెద్దలు తమను కుటుంబ సభ్యులుగా ఎంతో ఆదరించి భవాని ఘన విజయానికి తమవంతు కృషి చేశారని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు తప్ప తప్ప వారికి అవసరమైన షెడ్డు కోసం అడగలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తాము ఇచ్చిన మాకు కట్టబడి ఉంటామని వారెవరూ అడగక పోయినా తమ భవానీ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, 45 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. 43 వ వార్డు కంటిపూడి శ్రీనివాస్ అమ్మవారి గుడి అభివృద్ధి గురించి అడిగారని ముందు ఇచ్చిన మాట ప్రకారం మసీదు షెడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. రాజేంద్రనగర్ మసీదుకు పొజిషన సర్టిఫికెట్ గురించి కృషి చేశామని తమ భవాని చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.లక్ష ఇచ్చామని తన మిత్రులు చెరో రూ.50 వేలు ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తమను ఆదరించి గెలిపిస్తున్న ప్రజలకు. ప్రభుత్వ పరంగాను,తమ భవానీ చారిటబుల్ ట్రస్టు ద్వారాను ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వి శంకర్, ముస్లిం మైనారిటీ నాయకులు చాన్ బాషా, ఎస్ కె బషీర్, అస్లాం, ఎండీ బాబా ఖాన్ (ఖాన్ భాయ్), అప్సరీ, రఫీ, ఎండీ షాజన్,అహ్మద్ ఉనిషా, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

