మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడును టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి బుక్కే మనోహర్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి గిరిజనుల సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల అభ్యున్నతికి అవసరమైన పలు ముఖ్య అంశాలను ఆయన ముఖ్యమంత్రికి వినిపించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో అరకు కాఫీ, జిసిసి ఉత్పత్తులకు ప్రత్యేక అమ్మక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, దాంతో గిరిజన నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో బాలురు, బాలికల కోసం కొత్త భవనాల నిర్మాణం అత్యవసరమని తెలిపారు. ప్రస్తుతం అనేక వసతి గృహాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
తద్వారా గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి గిరిజనుల కోసం ప్రత్యేకమైన కొత్త ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని, ఆ ఫ్యాక్టరీలు ప్రారంభమైతే వేలాది గిరిజన యువతకు ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రికి వివరించారు.
గిరిజన సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర చర్యలు తీసుకోవాలని బుక్కే మనోహర్ నాయక్ సమర్పించిన నివేదికలో తెలియజేశారు.


