శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 11: విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ను అడ్డుకునేందుకు కోర్టుల్లో పిల్ వేయించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్లా మారారని టిడిపి బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్ రావు ఆరోపించారు. రూ.15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ద్వారా హైకోర్టులో పిల్ దాఖలు చేయించడం రాష్ట్ర భవిష్యత్తుపై దెబ్బ కొట్టడమేనని విమర్శించారు. గూగుల్ విశాఖకు వస్తుందనే వార్త వచ్చినప్పుడు మొదట దాన్ని “గోదాం”గా విమర్శించిన వైసీపీ నేతలు, తర్వాత దానిని తామే తీసుకొచ్చామని చెప్పారన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. తన పాలనలో పరిశ్రమలు రాష్ట్రం విడిచిపోవడానికి కారణమైన జగన్ రెడ్డి, ఇప్పుడు గూగుల్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లను కూడా భయపెట్టేలా వ్యవహరిస్తున్నారని ఉమేష్ రావు విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి వేగవంతమై, యువతకు ఉజ్వల భవిష్యత్తు దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బీమాల భాస్కర్ ముదిరాజ్, డి.వి. నారాయణ, వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, మణి, రమేష్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్న జగన్– టిడిపి నేత డా. ఉమేష్ రావు