ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిలుపు
హైదరాబాద్/తెలంగాణ:
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.
ఈ నిరసనల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు పూర్తిగా శాంతియుతంగా నిర్వహించాలని పార్టీ నేతలు సూచించారు.



