*యువభారతం నవ భారతాన్ని నిర్మించాలి*
ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం, నవంబర్పున్నమి ప్రతినిధి:-:
యువభారతం నవ భారతాన్ని నిర్మించే దిశగా కృషి చేయాలని ఆంధ్ర *విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ అన్నారు.* శనివారం ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సర్ మాట్లాడుతూ రానున్న దశాబ్దాలు భారతీయ యువతవేనని అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా రాణించడం, దేశ ప్రగతిలో భాగం కావడం ఎంతో ప్రధానమని సూచించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని చెప్పారు. విద్యార్థి వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో యువత చురుకుగా పాల్గొనాలని చెప్పారు. అంతర్జాతీయ విద్యార్థులకు ప్రత్యేకంగా కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తామని వాటిలో అందరూ పాల్గొని, తమ ప్రతిభను చాటాలని సూచించారు. కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య ఎస్. హరనాథ్, సోషియాలజీ, జర్నలిజం విభాగ ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకులందరూ కలిసి దాదాపు 75 మొక్కలను నాటారు. *ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాగాల స్వామి దాసు, ప్రొఫెసర్* *శ్రీమన్నారాయణ మూర్తి, డా. డి. రామారావు, డా. విజయలక్ష్మి, డా. పి.ఆర్.* *ఆర్. ప్రకాశ్, డా. ముట్లూరి అబ్రహాం, డా. జి. పుష్పలత, డా. చదువుల ఆశా కిరణ్* *రాజు, డా. సురేష్ మీనన్* తదితరులు పాల్గొన్నారు.


