Sunday, 29 March 2026
  • Home  
  • యారాడ మార్గంలో మరో ఆటో ప్రమాదం.. ప్రయాణికుల్లో భయాందోళన
- విశాఖపట్నం

యారాడ మార్గంలో మరో ఆటో ప్రమాదం.. ప్రయాణికుల్లో భయాందోళన

గాజువాక–యారాడ జనవరి (పున్నమి ప్రతినిధి) గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో మరోసారి ఆటో ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడుతో వెళ్తున్న ఆటోకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పిల్లర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఇదే మార్గంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. కొండ ప్రాంతమైన యారాడ మార్గంలో వరుస ప్రమాదాలతో ఆటో ప్రయాణాలు అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రహదారి భద్రత, వాహనాల తనిఖీలపై అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గాజువాక–యారాడ జనవరి (పున్నమి ప్రతినిధి)

గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో మరోసారి ఆటో ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడుతో వెళ్తున్న ఆటోకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పిల్లర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఇదే మార్గంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. కొండ ప్రాంతమైన యారాడ మార్గంలో వరుస ప్రమాదాలతో ఆటో ప్రయాణాలు అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రహదారి భద్రత, వాహనాల తనిఖీలపై అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.