27-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి)నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు పర్యటించారు. బండేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను…, కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో నాడు నేడు కార్యక్రమానికి 401 కోట్లరూ పాయాలు కు ప్రతిపాదనలు పంపినామని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపినారు. బుధవారంమనుబోలు
మండలం లోని చెర్లోపల్లి, బండే పల్లి గ్రామాలను ఆయన పరిశీలించారు జిల్లాలో 1085 స్కూ ళ్ల లో
గదులునిర్మిస్తామన్నారు. ఇందుకుగాను 115 కోట్లు
రూపాయల నిధులు తొలివిడితలో మంజూరు అయ్యినయన్నారు. ఆగస్టు 3 న పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్‌వాల్, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డ్స్ పెయింటింగ్, ఫినిషింగ్ పూర్తవ్వాలన్నారు. స్కూలు ప్రారంభం కాగానే ప్రతి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారమ్స్, బూట్లు అందించాలని.., మెరుగైన మౌలిక వసతులతో అత్యత్తుమ విద్యా బోధన అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని… డి.పి.ఓ కి తెలిపారు. నాడు-నేడు పనులకు ఇసుక కొరత ఉందని, సిమెంట్ ధరలు కూడా అధికంగా ఉన్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కలెక్టర్ మైనింగ్ శాఖ అధికారులతో మాట్లాడి నాడు-నేడు పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హార్టీ కల్చర్ ఎ.డి. తో కలిసి.., మనుబోలు మండలంలోని వంగతోటలను పరిశీలించారు. సాధారణంగా కోయంబేడు మార్కెట్ కి పండిన కూరగాయలను ఎగుమతి చేస్తుంటామని.., కరోనా కేసులు నమోదు అవడంతో కోయంబేడ్ మార్కెట్ కి కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయని.., దీంతో పండిన పంటన అమ్ముకోలేక పోతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో
స్థానికంగా కూరగాయ మార్కెటింగ్ కి వ్యాపారులతో మాట్లాడి., రైతులకు నష్టం కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కోదండరాం పురం లోని మెయిన్ పాఠశాల శిథిలావస్థకు చేరిందని విలేకరులు చెప్పగా వెంటనే స్పందించి ఎంపీడీవో సమగ్ర నివేదిక ఇస్తే చర్యలు చేపడతామన్నారు .
ఈ కార్యక్రమంలోఎస్ ఎస్ ఏ ఈఈ శ్రావణ్ కుమార్ ,ఈ ఈ ఆనంద్ రెడ్డి డి.పి.ఓ శ్రీమతి ధనలక్ష్మి, ఉద్యావనశాఖఎ.డి,ఎంపీడీవోవెంకటేశ్వర్లు,తహశీల్దార్ హరనాథ్ అధికారులు పాల్గొన్నారు.
మౌలిక వసతులు కల్పనే నాడు-నేడు లక్ష్యం …జిల్లా కలెక్టర్.యం. వి.శేషగిరి బాబు
27-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి)నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు పర్యటించారు. బండేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను…, కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో నాడు నేడు కార్యక్రమానికి 401 కోట్లరూ పాయాలు కు ప్రతిపాదనలు పంపినామని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపినారు. బుధవారంమనుబోలు మండలం లోని చెర్లోపల్లి, బండే పల్లి గ్రామాలను ఆయన పరిశీలించారు జిల్లాలో 1085 స్కూ ళ్ల లో గదులునిర్మిస్తామన్నారు. ఇందుకుగాను 115 కోట్లు రూపాయల నిధులు తొలివిడితలో మంజూరు అయ్యినయన్నారు. ఆగస్టు 3 న పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్‌వాల్, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డ్స్ పెయింటింగ్, ఫినిషింగ్ పూర్తవ్వాలన్నారు. స్కూలు ప్రారంభం కాగానే ప్రతి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారమ్స్, బూట్లు అందించాలని.., మెరుగైన మౌలిక వసతులతో అత్యత్తుమ విద్యా బోధన అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని… డి.పి.ఓ కి తెలిపారు. నాడు-నేడు పనులకు ఇసుక కొరత ఉందని, సిమెంట్ ధరలు కూడా అధికంగా ఉన్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కలెక్టర్ మైనింగ్ శాఖ అధికారులతో మాట్లాడి నాడు-నేడు పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హార్టీ కల్చర్ ఎ.డి. తో కలిసి.., మనుబోలు మండలంలోని వంగతోటలను పరిశీలించారు. సాధారణంగా కోయంబేడు మార్కెట్ కి పండిన కూరగాయలను ఎగుమతి చేస్తుంటామని.., కరోనా కేసులు నమోదు అవడంతో కోయంబేడ్ మార్కెట్ కి కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయని.., దీంతో పండిన పంటన అమ్ముకోలేక పోతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్థానికంగా కూరగాయ మార్కెటింగ్ కి వ్యాపారులతో మాట్లాడి., రైతులకు నష్టం కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కోదండరాం పురం లోని మెయిన్ పాఠశాల శిథిలావస్థకు చేరిందని విలేకరులు చెప్పగా వెంటనే స్పందించి ఎంపీడీవో సమగ్ర నివేదిక ఇస్తే చర్యలు చేపడతామన్నారు . ఈ కార్యక్రమంలోఎస్ ఎస్ ఏ ఈఈ శ్రావణ్ కుమార్ ,ఈ ఈ ఆనంద్ రెడ్డి డి.పి.ఓ శ్రీమతి ధనలక్ష్మి, ఉద్యావనశాఖఎ.డి,ఎంపీడీవోవెంకటేశ్వర్లు,తహశీల్దార్ హరనాథ్ అధికారులు పాల్గొన్నారు.