Friday, 13 March 2026
  • Home  
  • మోహినికుంట రైతులకు సాగునీరు విడుదల చేయాలని వినతి
- రాజన్న సిరిసిల్ల

మోహినికుంట రైతులకు సాగునీరు విడుదల చేయాలని వినతి

ముస్తాబాద్ /మార్చి/ పున్నమి ప్రతినిధి మోహినికుంట గ్రామ రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని కోరుతూ ఈరోజు సిద్దిపేటలోని S C E E ని రైతులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, మోహినికుంట సర్పంచ్ బిల్లం మురళి రైతులతో కలిసి పాల్గొన్నారు. మోహినికుంట గ్రామానికి కందుల చెరువు, రాజక్కపేట కొత్త చెరువు ద్వారా మల్లన్నసాగర్ నీటిని విడుదల చేసి ప్రవాహం కొనసాగించాలని కోరారు. దీంతో మోహినికుంట–ముస్తాబాద్ పరివాహక ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని వివరించారు. రైతుల సమస్యను పరిశీలించిన SC EE రెండు రోజుల్లో నీరు విడుదల అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోహినికుంట గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.

ముస్తాబాద్ /మార్చి/ పున్నమి ప్రతినిధి

మోహినికుంట గ్రామ రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని కోరుతూ ఈరోజు సిద్దిపేటలోని S C E E
ని రైతులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, మోహినికుంట సర్పంచ్ బిల్లం మురళి రైతులతో కలిసి పాల్గొన్నారు.
మోహినికుంట గ్రామానికి కందుల చెరువు, రాజక్కపేట కొత్త చెరువు ద్వారా మల్లన్నసాగర్ నీటిని విడుదల చేసి ప్రవాహం కొనసాగించాలని కోరారు. దీంతో మోహినికుంట–ముస్తాబాద్ పరివాహక ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని వివరించారు.
రైతుల సమస్యను పరిశీలించిన SC EE రెండు రోజుల్లో నీరు విడుదల అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మోహినికుంట గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.