ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో దప్పు శంకర్ – నర్సవ్వ దంపతుల చిన్న కుమారుడు దప్పు లక్ష్మణ్ వివాహ వేడుక సందర్భంగా నూతన దంపతులను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, గ్రామ పెద్దలు సుభాష్ రావు ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దంపతులు సుఖశాంతులతో, ఆనందంగా జీవితం గడపాలని ఆశించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.


