Story highlights
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 2 (పున్నమి ప్రతినిధి) జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొరసు తుఫాన్ ప్రభావం రానున్న రెండు రోజులు జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉందని మనుబోలు తహసీల్దార్ రమాదేవి తెలిపారు.
- ఈ నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 2 (పున్నమి ప్రతినిధి)
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొరసు తుఫాన్ ప్రభావం రానున్న రెండు రోజులు జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉందని మనుబోలు తహసీల్దార్ రమాదేవి తెలిపారు. ఈ నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఆవులు, గేదెలు, ఇతర పశువులను మేతకు బయటకు పంపవద్దని కోరారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని రెవెన్యూ యంత్రాంగం సూచించింది.
News Sources
- Punnami ReportingOwn reporting