Monday, 16 February 2026
  • Home  
  • మొంథా తుఫాన్ ప్రభావితులకు చిట్వేల్‌లో పునరావాస కేంద్రం సిద్ధం :-భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాలపై ఏర్పాట్లు పూర్తి – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి
- అన్నమయ్య

మొంథా తుఫాన్ ప్రభావితులకు చిట్వేల్‌లో పునరావాస కేంద్రం సిద్ధం :-భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాలపై ఏర్పాట్లు పూర్తి – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజల సురక్షితార్థం అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దుర్గరాజు మాట్లాడుతూ మొంథా తుఫాన్‌పై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరాదని, ప్రభుత్వ అధికారుల ద్వారా విడుదలయ్యే అధికారిక సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలు తమ ఇళ్లలో లేదా సురక్షిత స్థలాల్లోనే ఉండాలని, అత్యవసర పనులకే బయటకు రావాలని సూచించారు. పాఠశాల ఎన్‌సి‌సి అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ చిట్వేల్ మండల ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు కూడా ఉపాధ్యాయులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, వాచ్‌మెన్‌లు తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రపరచగా, పునరావాస బాధితుల కోసం మంచినీటి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చెన్నయ్య, సుహాసిని, కిరణ్ కుమార్ రాజు, వాచ్‌మెన్ వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజల సురక్షితార్థం అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

దుర్గరాజు మాట్లాడుతూ మొంథా తుఫాన్‌పై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరాదని, ప్రభుత్వ అధికారుల ద్వారా విడుదలయ్యే అధికారిక సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలు తమ ఇళ్లలో లేదా సురక్షిత స్థలాల్లోనే ఉండాలని, అత్యవసర పనులకే బయటకు రావాలని సూచించారు.

పాఠశాల ఎన్‌సి‌సి అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ చిట్వేల్ మండల ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు కూడా ఉపాధ్యాయులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, వాచ్‌మెన్‌లు తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రపరచగా, పునరావాస బాధితుల కోసం మంచినీటి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చెన్నయ్య, సుహాసిని, కిరణ్ కుమార్ రాజు, వాచ్‌మెన్ వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.