సికింద్రాబాద్, (మన పున్నమి ప్రతినిధి)
లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320హెచ్ ఆధ్వర్యంలో మెగా ఇంపాక్ట్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ & జాబ్ మేళాను ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో హరిహర కళాభవన్‌లో నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువత, గ్రాడ్యుయేట్లు, గృహిణుల కోసం ఉచితంగా నిర్వహించే ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రముఖ వక్తలు పాల్గొననున్నారు. రోజుకు 2000 మందికి భోజన సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశం పూర్తిగా ఉచితం.


