ముస్తాబాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతన స్వశక్తి మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు పాల్గొని భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం స్వశక్తి మహిళా భవనం నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు సంఘటితంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, మట్ట రమణారెడ్డి, కుక్కల దేవేందర్, ఉచిడీ బాల్ రెడ్డి, మహిళా సీఈఓతో పాటు పలువురు మహిళలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ముస్తాబాద్‌లో స్వశక్తి మహిళా భవనానికి భూమి పూజ
ముస్తాబాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతన స్వశక్తి మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం స్వశక్తి మహిళా భవనం నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు సంఘటితంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, మట్ట రమణారెడ్డి, కుక్కల దేవేందర్, ఉచిడీ బాల్ రెడ్డి, మహిళా సీఈఓతో పాటు పలువురు మహిళలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

