ముస్తాబాద్ /ఏప్రిల్/పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో KCR కప్-2026 క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలోని క్రికెట్ మైదానంలో ట్రాస్ వేసి పోటీలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. జిల్లా BRS పార్టీ అధ్యక్షులు తోట అగన్న, TSPSC సభ్యులు డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ముస్తాబాద్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి శీలం జానా బాయ్ కుర్ర సావిత్రి. మెంగని మనోహర్ శీలం స్వామి వంగూరి దిలీప్ టిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ పరిధిపేట వెంకటేష్ పాల్గొన్నారు.
అలాగే ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు మరియు యువకులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


