*మున్సిపల్ ఎన్నికల వేళ బిఎస్పీలో చేరికలు…*
పున్నమి న్యూస్ ప్రతినిధి:
01 ఫిబ్రవరి 2026
తెలంగాణ ఇంచార్జ్ :
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా ,రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలో , గత పాలకుల పాలన లానే అదే తరహాలో , 24 నెలలు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్,బి.ఆర్.ఎస్,&బిజెపి పార్టీల పై , తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది., అంతేకాకుండా ఆ పార్టీ నేతలను జనం ప్రశ్నిస్తుండడంతో వారికి సమాధానం చెప్పలేక పోవడంతో, మున్సిపల్ ఎన్నికల వేళ రాజేంద్ర నగర్ నియోజకవర్గ నుండి సుమారుగా
50 మంది నాయకులు నేడు బహుజన్ సమాజ్ పార్టీ లో చేరారు .
వీరిని రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి ,అభినందనలు తెలిపారు.
ఈ చేరిక కొరకై చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు తప్ప కృష్ణ గారు కీలక పాత్ర పోషించారు.
జై భీమ్…! జై భారత్



