ముధోల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మరియు బాసర మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసన సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంలో MROలు, బీజేపీ మండల అధ్యక్షులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.


