Sunday, 22 March 2026
  • Home  
  • ముంపు సమస్య కోసం డ్రైనేజీల ప్రక్షాళన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 36 39 డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు
- తూర్పు గోదావరి

ముంపు సమస్య కోసం డ్రైనేజీల ప్రక్షాళన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 36 39 డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు

ముంపు సమస్య కోసం డ్రైనేజీల ప్రక్షాళన – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ – 36… 39 డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలన రాజమహేంద్రవరం : జులై 27పున్నమి ప్రతి నిది నగరంలోని ముంపునకు గురవుతున్న ప్రాంతాలకు ఆ సమస్య నుంచి కొంతలో కొంతైనా ఉపసమనం కల్పించేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. స్థానిక 36.. 39 డివిజన్లకు సంబంధించి తుమ్మలోవ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న కల్వర్టులు, డ్రైనేజీల నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. నాణ్యతతో నిర్మాణం పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరం మొత్తం అభివృద్ధి చెందుతోందన్నారు. నగర సుందరీకరణతో పాటు ప్రధాన రహదారులతో అనుసంధానమైన రోడ్లు కూడా అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతోందన్నారు. పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మురగునీరు సక్రమంగా పారేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ఏదో ఒక అభివృద్ధి పని జరుగుతోందన్నారు. గత పాలకులు చేసిన అనాలోచిత పనులు కారణంగా వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడం జరుగుతోందని, ఆ అర్ధం లేని పనులను ఇప్పుడు తాము సరి చేయడం జరుగుతోందన్నారు. గత వైకాపా మాజీ ప్రజా ప్రతినిధులు చేసిన అనవసరమైన పనులు కారణంగా ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని మండిపడ్డారు. ప్రస్తుతం తాము చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకు ఏం కావాలో… వారికి ఏం అవసరమో… వారి ఆలోచనలకు తగ్గట్టుగానే చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు యాళ్ల ప్రదీప్‌, తంగెళ్ళ బాబీ, కరగాని వేణు, తుల్లి పద్మ, స్థానిక పెద్దలు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

ముంపు సమస్య కోసం డ్రైనేజీల ప్రక్షాళన
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌
– 36… 39 డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలన
రాజమహేంద్రవరం : జులై 27పున్నమి ప్రతి నిది
నగరంలోని ముంపునకు గురవుతున్న ప్రాంతాలకు ఆ సమస్య నుంచి కొంతలో కొంతైనా ఉపసమనం కల్పించేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. స్థానిక 36.. 39 డివిజన్లకు సంబంధించి తుమ్మలోవ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న కల్వర్టులు, డ్రైనేజీల నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. నాణ్యతతో నిర్మాణం పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరం మొత్తం అభివృద్ధి చెందుతోందన్నారు. నగర సుందరీకరణతో పాటు ప్రధాన రహదారులతో అనుసంధానమైన రోడ్లు కూడా అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతోందన్నారు. పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మురగునీరు సక్రమంగా పారేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ఏదో ఒక అభివృద్ధి పని జరుగుతోందన్నారు. గత పాలకులు చేసిన అనాలోచిత పనులు కారణంగా వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడం జరుగుతోందని, ఆ అర్ధం లేని పనులను ఇప్పుడు తాము సరి చేయడం జరుగుతోందన్నారు. గత వైకాపా మాజీ ప్రజా ప్రతినిధులు చేసిన అనవసరమైన పనులు కారణంగా ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని మండిపడ్డారు. ప్రస్తుతం తాము చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకు ఏం కావాలో… వారికి ఏం అవసరమో… వారి ఆలోచనలకు తగ్గట్టుగానే చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు యాళ్ల ప్రదీప్‌, తంగెళ్ళ బాబీ, కరగాని వేణు, తుల్లి పద్మ, స్థానిక పెద్దలు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.