నాయుడుపేట,ఆగస్టు పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్
నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శెట్టిపల్లివారీ వీధిలో ఉన్న మురికి కాలువలు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది మురుగు నీరు కాలువ నుంచి బయటకు వచ్చి ఇళ్ళ మధ్యలో చేరుతుంది దాని నుంచి విపరీతమైన దుర్వాసన మరియు దోమలు చేరుతున్నాయి. దీని గురించి ఎన్ని సార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించుకున్న దానిని పట్టించుకునే నాథుడు లేదని, కాలువలు పూడిక తియ్యడానికి వచ్చినవారు కూడా తు తు మంత్రం గా చేసి వెళ్తున్నారు , ఇప్పటికైనా అక్కడ ఉన్న సమస్య తెలుసుకుని దానికి శాశ్వత పరిష్కారం చూపాలని శెట్టిపల్లి వారి వీధి ప్రజలు కోరుకుంటున్నారు


